వరంగల్‌లో ఈనెల 12న జరిగే టీడీపీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశానికి పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు...
సాక్షి, హైదరాబాద్: వరంగల్‌లో ఈనెల 12న జరిగే టీడీపీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశానికి పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హాజరవుతారని టీడీఎల్‌పీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై అన్ని మండల కేంద్రాల్లో విపక్షాలతో కలిసి ఉద్యమం చేపడతామని శుక్రవారం ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో ఆయన చెప్పారు. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులతో చర్చించామని పేర్కొన్నారు.