
చాదర్‌ఘాట్: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నగరానికి ఇతర రాష్ట్రాల నుంచి ఉల్లి దిగుమతులు బంద్ చేసినట్లు మార్కెట్ జాయింట్ డైరెక్టర్‌శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రానికి దిగుమతి అవుతున్న ఉల్లిని నిలిపివేశామని ఇది సోమవారం నుంచి అమల్లోకి వచ్చినట్లు స్పష్టం చేశారు.తెలంగాణకు వచ్చే మహారాష్ట్ర, కర్ణాటకల్లో కరోనా వైరస్ సమస్య తీవ్రంగా ఉన్నందున అక్కడ నుంచి వచ్చే ఉల్లి దిగుమతిని ఈ నెల 14వ తేదీ వరకు ప్రభుత్వ ఆదేశాల మేరకు నిలిపివేస్తున్నామన్నారు.