► రాష్ట్రంలో అన్ని లెక్కలు ఆన్‌లైన్‌లో పొందుపరచాలన్న కేంద్రం
►విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లేఖ
సాక్షి, హైదరాబాద్: సర్వశిక్ష అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) కార్యక్రమాలపై ఇకపై ఆన్‌లైన్ పర్యవేక్షణ ప్రారంభం కానుంది. పారదర్శ కత పెంచేందుకు వివిధ రాష్ట్రాల్లో ఎస్‌ఎస్‌ఏ కింద చేపట్టే ప్రతి కార్యక్రమానికి సంబంధిం చిన వివరాలు, లెక్కలను ఆన్‌లైన్‌లో పొందు పర్చాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నిర్ణరుుంచింది. ఇందులో భాగంగా ప్రత్యేకంగా షగున్ పేరుతో ప్రత్యేక వెబ్ పోర్ట ల్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపింది. అన్ని రాష్ట్రాలతోపాటు తెలంగాణలోనూ ఆన్‌లైన్ మానిటరింగ్‌కు అవసరమైన చర్యలు చేపట్టాలని, ఎస్‌ఎస్‌ఏ కార్యకలాపాలను ఆన్ లైన్‌లో పొందుపరచాలంది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్య దర్శి రంజీవ్ ఆర్ ఆచార్యకు ఎంహెచ్‌ఆర్‌డీ అదనపు కార్య దర్శి రైనారే ఇటీవల లేఖ రాశారు.
లేఖలో పేర్కొన్న అంశాలివే...
షగున్ వెబ్‌పోర్టల్‌ను రెండు రకాలుగా చేస్తున్నాం. అందులో ఒకటి కార్యక్రమాల ఆన్‌లైన్ మానిటరింగ్. రెండోది సక్సెస్ స్టోరీ లు, బాగా అమలు చేసిన కార్యక్రమాలు, వాటి వీడియోలు, పేపరు క్లిప్పింగ్‌లు ఆన్‌లైన్ లో ఉంచుతాం. తెలంగాణకు సంబంధించిన అంశాలను తీసుకునేందుకు, ఎప్పటికప్పుడు సంప్రదించేందుకు ప్రత్యేకంగా రాష్ట్రంలో నోడల్ ఆఫీసర్‌ను నియమించండి.
- ఆన్‌లైన్ మానిటరింగ్ కోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్(ssamis.nic.in) రూపొందిం చాం. రాష్ట్రాల్లో నియమించే నోడల్ ఆఫీసర్లు ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు అవసరమైన ప్రొఫార్మాలను ఇందులో అందు బాటులో ఉంచుతాం.
సర్వశిక్ష అభియాన్‌పై ఆన్‌లైన్ పర్యవేక్షణ
Published Tue, Dec 6 2016 3:30 AM | Last Updated on Mon, Sep 4 2017 9:59 PM
Advertisement