ఒడిశా కార్మికుల ఆందోళన ఉదృతం
Published Fri, Jan 15 2016 9:03 AM | Last Updated on Sun, Sep 3 2017 3:44 PM
కరీంనగర్: కరీంనగర్ కలెక్టరేట్ ఒడిశా కార్మికులు శుక్రవారం ఆందోళనకు దిగారు. ఇసుక బట్టీల్లో కార్మికులపై యాజమాన్యాల వేధింపులు ఎక్కువయ్యాయని, వారిపై చర్యలు తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై జిల్లా అధికారులు ఒడిశా అధికారులకు సమాచారం అందించారు. కార్మిక శాఖ అధికారులు ఆందోళన చేపట్టిన వారిని సముదాయిస్తున్నారు.
గురువారం పెద్దపల్లి మండలం రంగాపూర్ లో ఓ బట్టీ యజమాని తమపై దాడి చేశాడని, తమకు న్యాయం చేయాలని కూలీలు రోడ్డెక్కారు. వారు కాలినడక జిల్లా కేంద్రానికి అర్ధరాత్రి తరలిరావడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇటుక బట్టీల్లో కూలీల పరిస్థితి, సౌకర్యాలపై జిల్లా జడ్జి నాగమారుతీశర్మ పరిశీలించి, కూలీలను సొంత మనుషుల్లా చూసుకోవాలని చెప్పి వెళ్లిన 24 గంటల్లోనే అదే బట్టీలో ఈ ఘటన జరగడం గమనార్హం.
Advertisement
Advertisement