‘ఔట్‌సోర్సింగ్‌ను అడ్డుకోవాలి’
బెల్లంపల్లి : సింగరేణి యాజమాన్యం ఐదు బొగ్గు గనుల ఔట్‌సోర్సింగ్‌కు రంగం సిద్ధం చేసిందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ప్రధానకార్యదర్శి వి.సీతారామయ్య తె లిపారు. గురువారం మందమర్రి ఏరియా శాం తిఖని గనిపై నిర్వహించిన గేట్‌మీటింగ్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. బొగ్గు గనులను ప్రైవేట్‌పరం చేయాలనే కుతూహలం యాజ మాన్యంలో పెరిగిందన్నారు. గనుల ప్రైవేటీకరణతో భవిష్యత్‌లో సింగరేణికి, కార్మికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులుంటాయని తెలిపారు. గనుల ఔట్‌సోర్సింగ్‌ను కార్మికులు తీ వ్రంగా ప్రతిఘటించాలని పేర్కొన్నారు. గుర్తిం పు సంఘం టీబీజీకేఎస్ కార్మికుల సమస్యలను తీర్చడంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందన్నారు.
టీబీజీకేఎస్‌లో గ్రూపుల ఆధిపత్యం పెరగడంతో కార్మికుల సమస్యలు పరిష్కారానికి నోచుకోలేకపోతున్నాయని విమర్శించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం సమ్మె చేసిన కార్మికులకు ఇంతవరకు బకాయిలు చెల్లించిన పాపాన పోలేదని ధ్వజమెత్తారు. పదో వేజ్‌బోర్డు కోసం కోల్ ఇండియా యాజమాన్యం కమిటీని ఏర్పాటు చేయడంలో తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తోందన్నారు. వేజ్‌బోర్డు కమిటీని ఏర్పాటు చేసి త్వరితగతిన డిమాండ్లు నెరవేర్చాల్సిన అవసరం ఉందన్నారు.
మెరుగైన వేతన ఒప్పందం కోసం ఏఐటీయూసీ కృషి చేస్తోందన్నారు. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ బెల్లంపల్లి బ్రాంచి కార్యదర్శి ఎం.వెంకటస్వామి, ఉపాధ్యక్షుడు దాగం మల్లేశ్, సహాయ కార్యదర్శి తిరుపతిగౌడ్, ఫిట్ సెక్రెటరీ ఎస్.మల్లేశ్, నాయకులు చిలుక రాజనర్సు, రాజేశం తదితరులు పాల్గొన్నారు.