తక్కువ కాలంలోనే సర్కారుపై ప్రజా వ్యతిరేకత | Over a short period a public outcry over the government - ponguleti | Sakshi
Sakshi News home page

తక్కువ కాలంలోనే సర్కారుపై ప్రజా వ్యతిరేకత

Published Sat, Oct 18 2014 12:31 AM | Last Updated on Tue, May 29 2018 4:15 PM

తక్కువ కాలంలోనే సర్కారుపై ప్రజా వ్యతిరేకత - Sakshi

తక్కువ కాలంలోనే సర్కారుపై ప్రజా వ్యతిరేకత

వైఎస్సార్ సీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి

హైదరాబాద్: నవ తెలంగాణ, బంగారు తెలంగాణ అని అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ నాలుగు నెలల కాలంలో ఎలాంటి కార్యక్రమాలు చేసిందో ప్రజలు గ్రహించారని వైఎస్సార్‌సీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. తక్కువ కాలంలోనే టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందన్నారు.

రైతులకు 8 గంటల విద్యుత్ అని చెప్పి 2 గంటలు కూడా ఇవ్వలేని పరిస్థితులున్నాయన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాపార్టీ సమీక్షా సమావేశాల్లో  క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు, సమస్యలను జిల్లానాయకులు, కార్యకర్తలు తమ దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు. శుక్రవారం పార్టీ కేంద్రకార్యాలయంలో నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల సమీక్షా సమావేశం జరిగింది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement