ఈ పద్ధతిలో నీటి వినియోగం చాలా తక్కువ. పొలాన్ని దున్నడం.. నారుమడి తయారు చేయడం.. నాటు అవసరం లేకుండానే వరి పండించవచ్చు. వరి విత్తనాన్ని నేరుగా విత్తి ఆరుతడి పంటగా సాగు చేయవచ్చు. ఈ పద్ధతిలో ఆరుతడి పంటలకు ఇచ్చేలా నీటిని ఇస్తే సరిపోతుంది. పొలంలో తేమ తగ్గకుండా చూడాలి. ఇందుకోసం తేమ లేని సమయంలో భూమిని బాగా దున్ని విత్తనాలను సాళ్లలో గానీ, సీడ్ డ్రిల్లర్ ద్వారా కాని విత్తితే సరిపోతుంది.
ఎకరాకు 12 కిలోల విత్తనం అవసరమవుతుంది. మాములు పద్ధతి మాదిరిగానే ఎరువులను వాడాల్సి ఉంటుంది. చీడపీడల సమస్య తక్కువగా ఉంటుంది. కలుపు ఎక్కువగా ఉంటుంది. అయితే కలుపు మందులు వాడి సమస్యను అధిగమించవచ్చు. అన్ని యాజమాన్య పద్ధతులు పాటిస్తే దిగుబడిలో ఎలాంటి తేడా ఉండదు.
ఆధునిక యంత్రంతో వరినాట్లు
ఆధునిక యంత్రంతో నాట్లు వేసి అధిక దిగుబడులు పొందవచ్చు. ఈ పద్ధతిలో నాట్లు వేయాలంటే ముందుగా నారును ట్రేలలో పెంచాల్సి ఉంటుంది. ట్రేలలో పెంచిన నారును, ప్రధాన పొలం సిద్దం చేసిన తర్వాత అక్కడకు తీసుకెళ్లి, నాటు మిషన్‌లో పెట్టి నాట్లు వేయాల్సి ఉంటుంది. ట్రేలలో నారును పెంచడం సామాన్య రైతులకు కొంత ఇబ్బందే. కూలీలతో పోల్చితే ఖర్చు తక్కువగా ఉన్నప్పటికి, ఈ పరికరాలు ఎక్కువ సంఖ్యలో అందుబాటులో లేవు.
డ్రిప్‌తో వరి సాగు
ఉన్న నీటిని డ్రిప్‌తో సద్వినియోగం చేసుకుంటూ సైతం వరి సాగు చేపట్టవచ్చు. ఒక మీటర్ వెడల్పు, 80 మీటర్ల పొడవుతో బెడ్లను తయారు చేసుకోవాలి. కలుపు నివారణ కోసం బెడ్లపైన మల్చింగ్ పేపర్ వేసుకోవాలి. అనంతరం విత్తనాలు వేసుకోవాలి. డ్రిప్ ద్వారా సాగు నీరుతోపాటు ఎరువులను సైతం అందించవచ్చు. ఒక సారి డ్రిప్ ఏర్పాటు చేసుకుంటే దాదాపు 10 ఏళ్లపాటు ఉపయోగించుకోవచ్చు. ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఏటా ఈ పద్ధతినే ఎంచుకునేవారికి ఇది ఉత్తమం.
ఆరుతడి పంటగానూ వరి
Published Tue, Aug 19 2014 3:28 AM | Last Updated on Sat, Sep 2 2017 12:04 PM
Advertisement
Advertisement