పామాయిల్ గెలలను ఫ్యాక్టరీ దిగుమతి చేసుకోకపోవడంతో రైతులు ప్రధాన రహదారిపై నిరసనకు దిగారు.
అశ్వారావుపేట (ఖమ్మం) : పామాయిల్ గెలలను ఫ్యాక్టరీ దిగుమతి చేసుకోకపోవడంతో రైతులు ప్రధాన రహదారిపై నిరసనకు దిగారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో సోమవారం చోటుచేసుకుంది. ఫ్యాక్టరీలోని క్రషింగ్ యూనిట్‌లో ఏర్పడిన సాంకేతికలోపంతో ఇప్పటికే దిగుమతి చేసుకున్న రూ. కొటి విలువైన గెలలు కుళ్లిపోయాయి. దీంతో ఈ రోజు రైతుల నుంచి గెలలు కొనడంలేదని ఫ్యాక్టరీ యాజమాన్యం తెలిపింది. దీంతో రైతులు రహదారిపై ఆందోళనకు దిగడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రైతులతో చర్చలు జరిపారు.