పైసలిస్తేనే పని! | Panchayati Raj collection danda | Sakshi
Sakshi News home page

పైసలిస్తేనే పని!

Published Sun, May 1 2016 3:39 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM

పైసలిస్తేనే పని! - Sakshi

పైసలిస్తేనే పని!

పంచాయతీరాజ్‌లో మామూళ్ల దందా
‘దారి’తప్పుతున్న అధికారులు
ప్రతి స్థాయిలో తప్పని చెల్లింపులు
నాణ్యత సర్టిఫికెట్‌తో మరో శాతం అదనం
ఇంజనీర్ల తీరుతో అధ్వానంగా పనులు

 
 
సాక్షి ప్రతినిధి, వరంగల్ : పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం అధికారుల తీరుతో ప్రభుత్వ లక్ష్యాలకు విఘాతం కలుగుతోంది. పంచాయతీరాజ్ శాఖలో చేపట్టిన అభివృద్ధి పనులు నత్తనడకన సాగేందుకు అందులోని ఇంజనీర్లే కారణమని గ్రామాల్లోని పనులను పరిశీలిస్తే తెలుస్తోంది. పనులు చేసే వారిని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు అన్ని రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నార నే ఆరోపణలు వస్తున్నాయి. ఎలాంటి పనికైనా పర్సెంటేజీలు చెల్లిస్తేనే అధికారులు బిల్లులు, రికార్డులను పూర్తి చేస్తున్నారు. పనులు ప్రారంభమైనరోజు నుంచే అధికారుల మామూళ్ల దందా మొదలవుతోంది.

ఇది బిల్లుల చెల్లింపు వరకు సాగుతోంది. కిందిస్థాయి నుంచి జిల్లాస్థాయి అధికారి వరకు లెక్కప్రకారం పర్సెంటేజీలు తీసుకునే ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్రప్రభుత్వం పీఆర్ ఇంజనీరింగ్ విభాగానికి గతంలో ఎన్నడూ లేనివిధంగా భారీగా నిధులు కేటాయించింది. అభివృద్ధి పనులు చేపట్టేం దుకు కాంట్రాక్టర్లు పోటీ పడుతున్నారు. అన్ని పనులకు సగటున 15 శాతం వరకు తక్కువ(లెస్) టెం డర్లు దక్కించుకుంటున్నారు. పనులు ప్రారంభిం చేందుకు ఒప్పందాలు కుదుర్చుకోవాల్సి ఉంటుం ది. ఇక్కడే అధికారుల మామూళ్ల పని మొదలవుతోంది. ఒప్పందాల కోసం కార్యాలయానికి వచ్చే కాంట్రాక్టర్లకు మొదట తమ కమీషన్ గురించి చెబుతూ పనులు ఎలా చేస్తే ఎంత మిగులుతుందనేది వివరిస్తున్నారు.

డబ్బు ఇవ్వనిదే అగ్రిమెంట్ చేయ డం లేదు. ఇప్పటికే  పనులను 15 శాతం తక్కువ మొత్తానికి తీసుకున్నామని, ఇంకా స్థానిక నేతలతో ఇబ్బంది ఉంటుందని ఎవరైనా కాంట్రాక్టర్ చెబితే అగ్రిమెంట్లు జరగకుండా అధికారులు నెలల పాటు జాప్యం చేస్తున్నారు. పైగా.. పనులు ఆలస్యమవుతున్నాయని స్థానికుల నుంచి ఒత్తిడి వస్తోందంటూ కాంట్రాక్టర్లను తమ ‘దారి’లోకి తెచ్చుకుంటున్నారు.  గత్యంతరం లేక కాంట్రాక్టర్లు అధికారుల ప్రతిపాదలను అంగీకరించి అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు.

మామూళ్లతో నాణ్యతకు పాతర...
అభివృధ్ధి పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు, అధికారులకు మామూళ్ల సంబంధాలు కొనసాగుతుండడం తో పనుల్లో నాణ్యత ఉండడం లేదు. పీఆర్ ఇంజనీరింగ్ విభాగంలో చేపట్టే పనుల మొత్తాన్ని బట్టి... ఒప్పందానికి ఒక శాతం, ఏఈకి 5 శాతం, డీఈఈకి మూడు శాతం, అకౌంట్ సెక్షన్‌కు 2 శాతం, నాణ్యత ధ్రువీకరణకు ఒక శాతం ఇవ్వాల్సి వస్తోందని కాం ట్రాక్టర్లు చెబుతున్నారు. డివిజన్ స్థాయి పనులైతే కమీషను మొత్తం మరో రెండు శాతం ఎక్కువగా ఉంటుందంటున్నారు. ఇవన్నీపోగా అదనపు ఖర్చు లు, కార్యాలయ ఖర్చుల కోసం మరో రెండు శాతం ఇవ్వాల్సి వస్తోందని వాపోతున్నారు. మామూళ్ల ప్రక్రియలో ఏ తేడా వచ్చినా బిల్లుల చెల్లింపులో అన్ని స్థాయి అధికారులు సవాలక్ష అడ్డంకులు పెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

మామూళ్ల ప్రక్రియతో అభివృద్ధి పనుల్లో ఇంజనీర్ల పర్యవేక్షణ ఉండడం లేదు. దీంతో నాణ్యత మచ్చుకైనా కనిపిం చడం లేదు. పని పూర్తయిన కొన్ని రోజులకే పూర్వ పు స్థితి వస్తోంది. దీన్ని నివారించేందుకు నాణ్యత ధ్రువీకరణ పత్రం ఇచ్చాకే పూర్తి స్థాయిలో బిల్లులు చెల్లించాలని నిబంధన పెట్టారు. ఈ నిబంధన నా ణ్యత ధ్రువీకరణ(క్యూసీ) విభాగం అధికారులకు వరంగా మారింది. పనికి కేటాయించిన నిధులలో ఒక శాతం ఇస్తేనే నాణ్యత ధ్రువీకరణ పత్రం జారీ చేస్తున్నారని కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నా రు. అవినీతి నియంత్రణపై రాష్ట్రప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకు న్నా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో పరి స్థితులు మారడం లేదు. ఈ విభాగం చేపట్టే పనుల్లో సామాజిక తనిఖీ ప్రక్రియ మొదలైనా మామూళ్ల కారణంగా నాణ్యతలోపాలు కొనసాగుతూనే ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement