కొత్త రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులు, ఆ ప్రాంతంలో ఉన్న భూములు లేని పేదల కుటుంబాల్లో ఒకరికి ఉచిత విద్య అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రాజధాని ప్రాంతంలో భూములిచ్చిన రైతు, పేద కుటుంబాలకు వర్తింపు
సాక్షి, హైదరాబాద్: కొత్త రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులు, ఆ ప్రాంతంలో ఉన్న భూములు లేని పేదల కుటుంబాల్లో ఒకరికి ఉచిత విద్య అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు సీఆర్‌డీఏ కార్యదర్శి అజయ్‌జైన్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ల్యాండ్‌పూలింగ్‌కు భూములిచ్చిన రైతు కుటుంబం నుంచి ఒకరికి, అలాగే పేదల కుటుంబాల్లో ఒకరికి ఉచిత విద్యను అందించనున్నారు.
పాలిటెక్నిక్‌తో పాటు ఇంజనీరింగ్, యూనివర్సిటీ కళాశాలల్లో చదివే వారికి ఇది వర్తిస్తుందన్నారు. 2014 డిసెంబర్ 8 నాటికి అమరావతిలో నివాసం ఉన్న వారే ఇందుకు అర్హులు. ఈ పథకం పదేళ్ల పాటు అమల్లో ఉంటుందని, గత ఏడాది అంటే 2015-16లో చదివిన విద్యార్థులకు సైతం ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తిస్తుంది. ఈ పథకం అమలు బాధ్యత జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి చూస్తారన్నారు.