మహబూబ్‌నగర్ టౌన్: ప్రభుత్వం ‘ఆసరా’ పథకం కింద మంజూరు చేసిన రెండు నెలల పింఛన్లను ఈనెల 10వ తేదీ నుంచి 15వరకు ఒకేసారి చెల్లించనున్నట్లు జిల్లా కలెక్టర్ జీడి ప్రియదర్శిని తెలిపారు. మంగళవా రం స్థానిక రెవెన్యూ సమావేశ మందిరం లో విలేకరులతో మాట్లాడుతూ, ప్రభు త్వ ఆదేశాల ప్రకారం నిర్ణయించిన తేదీ ల్లోనే మంజూరైన ప్రతి ఒక్కరికి పింఛన్లు అందజేస్తామన్నారు.
ఇందుకు సంబంధించి లబ్ధిదారుల జాబితాను ఇప్పటికే అన్ని గ్రామాలు, పట్టణాల్లో ప్రకటించామన్నారు. జాబితాలో పేర్లున్నా వారందరికీ పింఛన్లు అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఎమ్మెల్యేలు ముం దుకు వస్తే వారి చేతుల మీదుగానే పంపి ణీ చేపడతామని కలెక్టర్ పేర్కొన్నారు. వచ్చే నెల నుంచి నేరుగా లబ్దిదారుడి బ్యాంక్ ఖాతాలో పింఛన్ డబ్బులు జమ చేస్తామని, ఈవిషయమై లబ్దిదారులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. నెలీ ఖరులోగా ఆహార భద్రత కార్డుల పక్రియను పూర్తి చేస్తామని, అర్హులైన వారందరికీ కార్డులను అందిస్తామన్నారు. ఒకవేళ కార్డులు జారీ చేయలేకపోతే తాత్కాలిక కూపన్ల ద్వారా రేషన్ పంపిణీ చేస్తామని ఆమె వివరించారు.
నేడు జిల్లాలో సీఎం ఏరియల్ సర్వే
పరిశ్రమల ఏర్పాటుకు కేటారుుంచిన భూములను పరిశీలించేందుకు ముఖ్యమత్రి కేసీఆర్ బుధవారం ఏరియల్ సర్వే నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా హెలికాప్టర్ నుంచి జి ల్లాకు సంబంధించి భూములను పరి శీలిస్తారన్నారు. ఈ సమావేశంలో డీఆ ర్వో రాంకిషన్, కేఆర్‌సీ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రేపు మంత్రి హరీష్‌రావు రాక
జిల్లాలో వాటర్ ట్యాంక్ నిర్మాణంతోపాటు, నీటి వినియోగంపై ఈనెల 4వ తేదీన నిర్వహించనున్న జిల్లా పరిషత్ ప్రత్యేక సర్వసభ్య సమావేశానికి రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు హాజరుకానున్నుట్లు జిల్లా కలెక్టర్ జీడి ప్రియదర్శిని మంగళవారం తెలిపారు. బుధవారం ఉదయమే జిల్లాకు చేరుకొని 11గంటల వరకు వివిధ ప్రారంభోత్సవాలు నిర్వహిస్తారన్నారు. అనంతరం సమావేశానికి హాజరవుతారన్నారు. మధ్యాహ్నం 3గంటలకు కొత్తకోట మండలం శంకర్‌సముద్రం వెళ్లి అక్కడ ప్రత్యేక సమావేశంలో పాల్గొననున్నట్లు తెలిపారు.
ఒకేసారి రెండు నెలల పింఛన్లు
Published Wed, Dec 3 2014 1:43 AM | Last Updated on Fri, Sep 28 2018 7:14 PM
Advertisement