
ఆదిలాబాద్, గుడిహత్నూర్(బోథ్): మండల కేంద్రానికి చెందిన ఓ మహిళకు కరోనా సోకిందని పుకార్లు వచ్చాయి. దీంతో ఆ మహిళ నివాసం ఉంటున్న కాలనీవాసుల నుంచి వేధింపులు మొదలయ్యాయి. వేధింపులు ఎ క్కువ కావడంతో సదరు మహిళ కుటుంబ సభ్యులు బుధవారం స్థానిక పోలీసులను ఆశ్రయించారు. ఎస్సై రోహిణి కాలనీకి చేరుకొని అవగాహన కల్పించారు. అనవసర పుకార్లు పుట్టించి వేధింపులకు గురి చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. కాగా సదరు మహిళ జిల్లా కేంద్రంలోని కంటైన్మెంట్ ఏరియా అయిన అంబేద్కర్‌నగర్ నుంచి ఈ నెల 12న గుడిహత్నూర్‌లో తన తల్లిదండ్రుల ఇంటికి వచ్చింది. దీంతో సదరు మహిళలకు కరోనా ఉందని పుకార్లు పుట్టాయి. విషయం తెలుసుకున్న మండల వైద్యాధి కారి డాక్టర్ నీలోఫర్ సదరు మహిళకు కౌన్సిలింగ్ నిర్వహించి హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment