బుధవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు.
• పూర్తి చేసేందుకు ఇవ్వాలని కేంద్రానికి పీఎంకేఎస్‌వై కమిటీ ప్రతిపాదన
• పీఎంకేఎస్‌వై ప్రాజెక్టులపై కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి సమీక్ష
• హాజరైన కమిటీ చైర్మన్ బ్రిజ్ మోహన్, సభ్యుడు హరీశ్‌రావు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నిర్మాణ దశలో ఉన్న 185 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి రూ.45 వేల కోట్లతో ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి కృషి సించారుు యోజన (పీఎంకేఎస్‌వై) కమిటీ సిఫారసు చేసింది. పీఎంకేఎస్‌వై కింద కేంద్రం గుర్తించిన 99 ప్రాజెక్టుల పురోగతి, నిధుల సమస్యల వంటి అంశాలపై చర్చించడానికి కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి అమర్జిత్ సింగ్ అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో ఉన్నత స్థారుు సమా వేశం జరిగింది. దీనికి పీఎంకేఎస్‌వై అమలు కమిటీ చైర్మన్, ఛత్తీస్‌గఢ్ మంత్రి బ్రిజ్ మోహన్ అగర్వాల్, కమిటీ సభుడైన తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు, ఇతర రాష్ట్రల మంత్రులు పాల్గొన్నారు.
దేశంలో ఇప్పటి వరకు పూర్తెన ప్రాజెక్టుల్లో చాలా వరకు నిర్ణీత లక్ష్యాన్ని చేరుకోవడం లేదని కమిటీ గుర్తించినట్టు సమావేశం అనంతరం హరీశ్‌రావు మీడియాకు తెలిపారు. ప్రాజెక్టుల నిర్మాణం, వినియోగం మధ్య చాలా వ్యత్యాసం ఉటోందని గుర్తించామన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టి, భూసేకరణ చేసిన తరువాత కూడా చివరి ఆయకట్టు వరకు నీరు రాక తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పారు. ఈ వ్యత్యాసాన్ని తగ్గించడానికి ప్రాజెక్టుల్లోని నీటిని చివరి ఆయకట్టు వరకు అందించడానికి కోసం.. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టుల పూర్తికి రూ. 45 వేల కోట్లతో ఒక కొత్త కార్యక్రమాన్ని తీసుకురావాలని కమిటీ తీర్మానం చేసినట్టు తెలిపారు.
ఈ పథకం కింద దేశంలో దాదాపు 185 ప్రాజెక్టులను పూర్తి చేయాల్సి ఉందని ప్రాథమికంగా గుర్తించినట్టు తెలిపారు. ఈ విషయంపై వివిధ రాష్ట్రాల అభిప్రాయలను కూడా కోరినట్టు చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణ లక్ష్యం-వినియోగం మధ్య వ్యత్యాసం తగ్గించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశమని, అలాగే విద్యుదుత్పాదన, స్ప్రింక్లర్లు, డిప్‌లను కూడా ప్రోత్సహించేలా ప్రణాళికలు రూపొందించాలని కమిటీ నిర్ణరుుంచినట్టు తెలిపారు. అదేవిధంగా నగరాల నుంచి బయటకు వచ్చే నీటిని(డొమెస్టిక్ వాటర్) శుద్ధి చేసి వ్యవసాయానికి వినియోగిం చుకునేలా ప్రణాళికలను రూపొందించినట్టు తెలిపారు. ఏ రాష్ట్రాలు త్వరితగతిన ప్రాజెక్టులను పూర్తి చేస్తాయో, ఏ రాష్ట్రాలు ఎక్కువ ఆయకట్టును సాధిస్తాయో వాటికి 20 శాతం నిధులు అదనంగా ఇచ్చేలా ప్రతి పాదనలు చేశామన్నారు. ఈ ప్రతిపాదన లన్నింటినీ కేంద్రానికి పంపి వచ్చే బడ్జెట్‌లోపు ఆమోదించాలని కోరినట్టు చెప్పారు.
కృషి విజ్ఞాన కేంద్రాలు ఏర్పాటు చేయండి
తెలంగాణలో జిల్లాల పునర్విభజన తరువాత 31 జిల్లాలు ఏర్పాటు చేయడంతో జిల్లాకు ఒకటి చొప్పునా.. 31 కృషి విజ్ఞాన కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్‌కు హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. పీఎంకేఎస్‌వై సమీక్ష తరవాత ఆయన రాధామోహన్‌ను కలిశారు. దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు హరీశ్‌రావు తెలిపారు. ఉల్లిగడ్డల కొనుగోలుకు సహకారం ఇవ్వాలని, పప్పు దినుసులకు మద్దతు ధర వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరినట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గోడౌన్ల నిర్మాణాన్ని పెద్ద ఎత్తున చేపడుతోందని, దీనికి కేంద్ర సాయంగా రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద రూ. 400 కోట్లు విడుదల చేయాలని కోరినట్టు తెలిపారు. హరీశ్ వెంట పార్టీ ఎంపీలు జితేందర్‌రెడ్డి, సీతారాంనాయక్, పసునూరి దయాకర్, కొత్తా ప్రభాకర్, బూర నరసయ్య గౌడ్, పొడులేని శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని పక్కన పెట్టండి..
ప్రాజెక్టుల పూర్తికి నాబార్డ్ ద్వారా రుణాల ను మంజూరు చేస్తామని కేంద్రం చెప్పిన నేపథ్యంలో.. రాష్ట్రాల ఎఫ్‌ఆర్‌బీఎం పరి మితిని పక్కన పెట్టి రుణాలు మంజూరు చేయాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్టు హరీశ్ తెలిపారు. నోట్ల రద్దు వల్ల రాష్ట్రాలకు ఇబ్బందులు కలుగుతు న్నాయని, ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని తొలగించి రుణాన్ని అందించాలని కమిటీ తీర్మానం చేసిందన్నారు. లేదంటే రాష్ట్రాల్లోని కార్పొరేషన్లకు నాబార్డు ద్వారా నేరుగా రుణాలు ఇవ్వాలని.. రాష్ట్ర ప్రభుత్వాలు హామీ ఇస్తాయని ప్రతిపాదించామన్నారు.