పంటల్లో ఉత్పాదకత పెంచాలి | pocharam srinivas reddy suggest to agriculture scientist for Crop Productivity | Sakshi
Sakshi News home page

పంటల్లో ఉత్పాదకత పెంచాలి

Published Tue, Apr 4 2017 2:18 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM

పంటల్లో ఉత్పాదకత పెంచాలి - Sakshi

పంటల్లో ఉత్పాదకత పెంచాలి

వ్యవసాయ శాస్త్రవేత్తలకు మంత్రి పోచారం సూచన
హైదరాబాద్‌: వివిధ పంటల్లో ఉత్పాదకత పెంచి రైతులకు అధిక ఆదాయం కల్పించేందుకు వ్యవసాయ శాస్త్రవేత్తలు కృషి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలం గాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వ్యవసాయ శాస్త్రవేత్తలతో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అధిక దిగుబడినిచ్చే వంగడాలను రూపొం దించడంతో పాటు సాగు ఖర్చులను తగ్గిం చడంపై పరిశోధనలు జరపాలని వ్యవసాయ శాస్త్రవేత్తలను కోరారు. యాంత్రీకరణ విని యోగం పెంచడంతో సాగు ఖర్చులు తగ్గిం చడంపై మరింత లోతైన అధ్యయనం జరపా లని సూచించారు.

రైతుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చేందుకు ప్రముఖ శాస్త్రవేత్త ఎం.ఎస్‌.స్వామినాథన్‌ చేసిన సిపార్సులను కేంద్రం అమలు చేస్తే 70 శాతం రైతుల ఇబ్బందులు తీరతాయని అన్నారు. అలాగే పంటల బీమా నిబంధనలను సరళతరం చేసి ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయే రైతులకు సకాలంలో నష్టపరిహారం అందిం చాల్సిన అవసరం ఎంతైనా ఉంద న్నారు. మేలు రకాల విత్తనో త్పత్తికి ఉద్యాన విశ్వవిద్యాలయం, ఉద్యాన శాఖ కలసి పని చేయా లని సూచించారు.

బొంగ్లూరులో పూల మార్కెట్‌
పంట కాలనీల ఏర్పాటులో భాగంగా రంగా రెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని మంచాల, యాచారం మండలా ల్లోని 38 గ్రామాల్లో మొదటి క్లస్టర్‌ ఏర్పా టుకు సన్నాహాలు చేస్తున్నామని పోచారం తెలిపారు. అలాగే బొంగ్లూరులో 2 ఎకరాల్లో పూల మార్కెట్‌ ఏర్పాటుకూ సన్నాహాలు చేస్తున్నామన్నారు. శాస్త్ర పరిజ్ఞానంతో పాటు వ్యవసాయ, ఉద్యాన శాఖలు అందిస్తున్న పథకాలను రైతులకు అందించి, వారు లాభాలు పొందేలా కృషి చేయాలని పేర్కొ న్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి పి.పార్థసారథి, వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్‌ వి.ప్రవీణ్‌రావు, ఉద్యానశాఖ కమిషనర్‌ వెంకట్రామిరెడ్డి, డీన్‌ డాక్టర్‌ విజయ్, విశ్వ విద్యాలయాల ఉన్నతాధికారులు, శాస్త్ర వేత్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement