మంత్రి పోచారం వెల్లడి
సాక్షి, హైదరాబాద్: గద్వాల జోగులాంబ జిల్లాలో నకిలీ మిరప విత్తనాలతో నష్టపో యిన రైతులకు త్వరలోనే సంబంధిత కంపెనీల నుంచి నష్టపరిహారం ఇప్పిస్తా మని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఆయా కంపె నీల ప్రతినిధులతో మంగళవారం ఆయన చర్చలు జరిపారు. ఈ సందర్భంగా 326 ఎకరాలలో నష్టపోయిన రైతులకు యూని వెజ్ కంపెనీ పరిహారాన్ని చెల్లించిందని అన్నారు.
అలాగే మోన్‌శాంటో ఎకరానికి రూ.15వేలు పరిహారం ఇవ్వడానికి సంసి ద్ధత వ్యక్తం చేసిందన్నారు. మిర్చి రైతులకు ఇబ్బందులు కలగకుండా చిల్లీ యాక్ట్ తీసు కొస్తున్నామన్నారు. ఈ ఏడాది మిర్చి దిగు బడులు బాగా వచ్చాయని, అయితే కేంద్రం మద్దతు ధర ప్రకటించకపోవడం తో కొనుగోళ్లకు ఇబ్బంది ఏర్ప డిందన్నా రు. మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ద్వారా కొనుగోళ్లకు సాయం చేయాలని కేంద్ర వ్యవసాయ మంత్రిని కోరానన్నారు.