పీఆర్‌టీయూ(టీ) జాతీయ సదస్సులో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ
సాక్షి, హైదరాబాద్ : ‘‘బాల కార్మికులను, బడి మానేసిన చిన్నారుల (డ్రాపవుట్స్)ను తిరిగి బడిలో చేర్పించే బాధ్యతను పోలీసులకు అప్పగిస్తాం. ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒక సబ్ ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారిని ఈ పనులకు వినియోగిస్తాం’’ అని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అన్నారు. ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ టీచర్ ఆర్గనైజేషన్స్ (ఆఫ్టో), పీఆర్‌టీయూ (తెలంగాణ) సంయుక్తంగా మాదాపూర్‌లోని జూబ్లీరిడ్జీ హోటల్లో ‘అందరికీ గుణాత్మక విద్య’ అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు ఏర్పాటు చేశారుు. శనివారం తొలిరోజు సదస్సును ప్రారంభించిన మహమూద్ అలీ మాట్లాడుతూ.. విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నా బడిఈడు చిన్నారుల్లో 30 శాతం మంది స్కూలుకు రావడం లేదన్నారు.
విద్యామంత్రి జగదీశ్వరరెడ్డి మాట్లాడుతూ కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్యను అందిస్తామన్నారు. ఎంపీ కె.కేశవరావు వూట్లాడుతూ విద్యాభివృద్ధి కోసం శాస్త్రీయ ధృక్పథంతో విధానాలను రూపొందించాలన్నారు. కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు సుధాకరరెడ్డి భూపాల్‌రెడ్డి, భానుప్రకాశరావు, జగదీశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే లకా్ష్మరెడ్డి, ఆఫ్టో చైర్‌పర్సన్ అన్నపూర్ణ, సెక్రటరీ జనరల్ ధర్మవిజయ్ పండిట్, పీఆర్‌టీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు హర్షవర్థన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి వేణుగోపాలస్వామి, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
డ్రాపవుట్స్ కోసం పోలీసు సాయం
Published Sun, Jul 27 2014 2:05 AM | Last Updated on Sat, Sep 2 2017 10:55 AM
Advertisement