మెదక్ జిల్లా తోగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామంలో శనివారం మధ్యాహ్నం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.
తోగుట: మెదక్ జిల్లా తోగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామంలో శనివారం మధ్యాహ్నం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసుల లాఠీ చార్జ్‌లో నలుగురు మహిళలకు గాయాలు అయ్యాయి. మల్లన్న సాగర్ ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లో సర్వేకు ఆర్డీవో పోలీసులతో కలసి వచ్చారు. వీరిని గ్రామస్తులు అడ్డుకున్నారు. పరిహారంపై పూర్తి వివరాలు తెలిపిన తర్వాతే సర్వే చేయాలని పట్టుబట్టారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. తోపులాట జరగడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. నలుగురు మహిళలకు గాయాలు అయ్యాయి. దీంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది.