ఎట్టకేలకు ఆమోదించిన హోంశాఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పలువురు అదనపు ఎస్పీల బదిలీలకు సంబంధించిన ఫైలుకు హోంశాఖ ఎట్టకేలకు ఆమోద ముద్ర వేసింది. డీజీపీ కార్యాలయం నుంచి పదిహేను రోజుల క్రితం వెళ్లిన ప్రతిపాదనల ఫైలు హోంమంత్రి పేషీలో పెండింగ్‌లో ఉన్నట్టు పోలీస్ వర్గాలు తెలిపాయి. ఈ వ్యవహారంపై పోలీస్–హోంశాఖ మధ్య కోల్డ్ వార్ కథనం ప్రభుత్వ వర్గాల్లో సర్వత్రా చర్చకు దారితీసింది. ముఖ్యమంత్రి ఆమోదం పొందిన తర్వాత కూడా హోంశాఖలో ఫైలు పెండింగ్‌లో ఉండటంపై ఆరోపణలు వస్తుండటంతో మంగళవారం ఆమోదముద్ర వేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ మేరకు ఆదేశాలు వెలువడాల్సి ఉంది.
వరంగల్‌లో అధికార టీఆర్‌ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ, హైదరాబాద్‌లో రాష్ట్రపతి ప్రణబ్ పర్యటన నేపథ్యంలో ఈనెల 28 తర్వాత ఆదేశాలు వెలువడతాయని హోంశాఖ వర్గాలు తెలిపాయి. బందోబస్తు, భద్రత వ్యవహారాల్లో కొంత మంది బదిలీ అయ్యే అదనపు ఎస్పీలు నిమగ్నమయ్యా రని అధికారులు తెలిపారు. డీజీపీ కార్యాలయం నుంచి హోంశాఖకు వెళ్లిన ప్రతి పాదనలను బట్టి అధికారులు ఈ కింది పోస్టులకు బదిలీ కానున్నట్టు తెలిసింది.
ప్రధానంగా బదిలీ అయ్యే అధికారులు
అధికారి బదిలీ అయ్యే స్థానం
ఎం.వెంకటేశ్వర్‌రావు ఎల్బీనగర్ డీసీపీ (రాచకొండ)
ఎన్.కోటిరెడ్డి మహబూబాబాద్ ఎస్పీ
అన్నపూర్ణరెడ్డి వికారాబాద్ ఎస్పీ
శశిధర్‌రాజు ఈస్ట్‌జోన్ డీసీపీ (హైదరాబాద్)
డీవీ శ్రీనివాస్‌రావు జనగామ డీసీపీ
ఉమామహేశ్వర శర్మ మల్కాజ్‌గిరి డీసీపీ