సాక్షి, భూపాలపల్లి: ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కనుంది. రెండు నెలలుగా నిర్వహించిన ఎన్నికల ప్రచారం ఒక ఎత్తయితే.. వచ్చే 20 రోజులను పార్టీలు, అభ్యర్థులు మరింత కీలకంగా భావిస్తున్నారు. ఇప్పటి వరకు చోటా మోటా నాయకులు అడపాదడపా పార్టీలు మారా రు. ప్రస్తుతం చేరికల పర్వం జోరందుకుంది. అభ్యర్థులు గ్రామాల్లో పర్యటించే సమయంలోనే తమ పార్టీల ఖండువాలు కప్పి ఆహ్వానిస్తున్నారు. ముఖ్యంగా యువతపైనే దృష్టి సారించారు. ద్వితీయ శ్రేణి ఓటర్లను, కొద్దో గొప్పో ఓటర్ల వద్ద పలుకుబడి కలిగిన వారిని చేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇదే అదనుగా ఎప్పటి నుంచో పార్టీ మారాలని చూస్తున్న వారు జంప్ చేస్తున్నారు.
పార్టీల్లో వలసల జోరు..
టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ అనే తేడా లేకుండా అన్ని పార్టీల్లోకి వలసలు కొనసాగుతున్నాయి. స్వతంత్రంగా పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా నిలవడానికి స్వపక్షాన్ని సైతం వీడుతున్నారు. రెండు నెలల కాలంతో పోల్చితే ప్రస్తుతం వలసల ఉధృతి పెరిగింది. ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో ప్రకటించనుండడంతో చేరికలు పెరిగే అవకాశం ఉంది. ఇన్ని రోజులు తగిన సమయం కోసం వేచి చూసిన నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే అభ్యర్థుల గ్రామాల పర్యటనను అదనుగా భావిస్తున్నారు. దీనికి తోడుగా అభ్యర్థులు సైతం చేరికలతో తమ బలాన్ని, ఓట్లను పెంచుకోవాలని చూస్తున్నారు. నామినేషన్ వేసే సమయానికి గ్రామాల్లోని ప్రధాన నాయకులను తమ పార్టీలోకి చేర్చుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు.
ద్వితీయ శ్రేణి నాయకులు,యువతే టార్గెట్
నాయకులు ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గాల్లోని ప్రతి గ్రామాన్ని సందర్శిస్తున్నారు. ప్రతి గ్రామంలో చేరికలు ఉండేలా నాయకులు ప్రణాళికలు రచిస్తున్నారు. అన్ని పార్టీలు ప్రధానంగా మండల స్థాయి ద్వితీయ శ్రేణి నాయకులపై దృష్టి కేంద్రీకరించారు. ఇతర పార్టీల సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు, మండలాధ్యక్షులు తదితర స్థానా ల్లో ఉన్న వారిని చేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
ద్వితీయశ్రేణి నేతలు చేరితే వారికుం డే ఓటు బ్యాంకు తమ ఖాతాలో పడిపోతుందని భావిస్తున్నారు. దీంతో ప్రస్తుతం పార్టీలో ప్రాధాన్యత లేదనుకున్న వారు, పదవులను ఆశించి భంగపడ్డవారు, ఇతర నేతలతో పొసగని వారు పక్క చూపులు చూస్తున్నారు. మరికొందరు గెలిచే అభ్యర్థిని అంచనా వేసుకుని పార్టీలు మారుతున్నారు. గ్రామాల్లోని యువతకు పార్టీలు గాలం వేస్తున్నాయి. కొత్తగా ఓటర్లుగా నమోదైన వారిని తమవైపు తప్పుకునేందుకు ప్రధాన పార్టీలన్ని పాలువులు కదుపుతున్నాయి. తటస్థంగా ఉంటు న్న వారిని సూతం అనుకూలంగా మార్చుకోవాల ని ప్రయత్నాలు చేస్తున్నాయి.
అన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి..
జిల్లాలోని భూపాలపల్లి, ములుగు నియోజకవర్గాలతోపాటు జిల్లాలో కొంత మేర ఉన్న మం«థని నియోజకవర్గంలో జంప్ జిలానీల జోరు పెరిగిం ది. ముఖ్యంగా మంథనిలో చేరికల జోరు ఎక్కువగా కనిపిస్తోంది. మహాముత్తారం, మహదేవపూర్, కాటారం, మల్హర్ మండలాల్లో నువ్వానేనా అన్న ట్లు టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు వలసలను ప్రోత్సహిస్తున్నాయి. మంథనిలో పుట్ట మధు, శ్రీధర్ బాబు పోటాపోటీగా పార్టీల్లోకి ఆహ్వానిస్తున్నారు. ఇటీవల భూపాలపల్లి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పార్టీల్లోకి చేరికలు జరుగుతున్నాయి.
టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలోకి వలసలు ఊపందుకున్నాయి. ములుగులోనూ ప్రస్తుతం ఇదే పరి స్థితి కొనసాగుతోంది. భూపాలపల్లి నియోజకవర్గంలో బీజేపీకి చెందిన టేకుమట్ల మండల అధ్యక్షుడు గాజర్ల పోశాలు, రాష్ట్ర నాయకుడు కాసర్ల రాంరెడ్డి కాంగ్రెస్‌లో చేరాడు. అలాగే చిట్యాల జెడ్పీటీసీ కాట్రెవుల సాయిలు కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరాడు. మంథని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కర్రు నాగయ్య టీఆర్‌ఎస్‌లోకి చేరిన తరువాత ప్రస్తుతం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నా డు. ప్రస్తుతానికి టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యే ఎక్కువగా చేరికలు జరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment