కాలుష్యమే పెద్ద సమస్య: ప్రణబ్ | pollution biggest problem for cities says, pranab mukherjee | Sakshi
Sakshi News home page

కాలుష్యమే పెద్ద సమస్య: ప్రణబ్

Published Thu, Oct 9 2014 6:38 PM | Last Updated on Sat, Sep 2 2017 2:35 PM

కాలుష్యమే పెద్ద సమస్య: ప్రణబ్

కాలుష్యమే పెద్ద సమస్య: ప్రణబ్

హైదరాబాద్: రానున్న ఐదేళ్లలోపు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పిలుపునిచ్చారు. హైదరాబాద్ జరుగుతున్న 11వ మెట్రో పొలిస్ సదస్సులో గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... నగరాలకు కాలుష్యం పెద్ద సమస్యగా మారిందన్నారు. ప్రజా రవాణా వ్యవస్థను సంస్కరించడం ద్వారా ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని సూచించారు.

దేశంలో 100 స్మార్ట్ సిటీల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ఈ శతాబ్దం అంతా నగరాలదేనని రాష్ట్రపతి పేర్కొన్నారు. మెట్రో పొలిస్ సదస్సును విజయవంతంగా నిర్వహించినందుకుతెలంగాణ సీఎం కేసీఆర్ ను రాష్ట్రపతి అభినందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement