Metro polis
-
కాలుష్యమే పెద్ద సమస్య: ప్రణబ్
హైదరాబాద్: రానున్న ఐదేళ్లలోపు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పిలుపునిచ్చారు. హైదరాబాద్ జరుగుతున్న 11వ మెట్రో పొలిస్ సదస్సులో గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... నగరాలకు కాలుష్యం పెద్ద సమస్యగా మారిందన్నారు. ప్రజా రవాణా వ్యవస్థను సంస్కరించడం ద్వారా ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని సూచించారు. దేశంలో 100 స్మార్ట్ సిటీల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ఈ శతాబ్దం అంతా నగరాలదేనని రాష్ట్రపతి పేర్కొన్నారు. మెట్రో పొలిస్ సదస్సును విజయవంతంగా నిర్వహించినందుకుతెలంగాణ సీఎం కేసీఆర్ ను రాష్ట్రపతి అభినందించారు. -
పట్టణాల నుంచి 75 శాతం జీడీపీ
రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి.కె.మహంతి రాయదుర్గం: పట్టణాలు, నగరాల నుంచి 2030 నాటికి జీడీపీలో 75 శాతం వస్తుందని అంచనాలు చెబుతున్నాయని, పట్టణ ప్రాంతాలను ఆ స్థాయిలో అభివృద్ధి పరచాల్సిన అవసరాన్ని గుర్తించాలని రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి.కె.మహంతి పేర్కొన్నారు. గచ్చిబౌలిలోని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌లో మెట్రో పొలిస్ సదస్సును పురస్కరించుకొని ఏర్పాటు చేసిన అర్బన్ ఫైనాన్స్‌పై ప్రీ కాన్ఫరెన్స్‌లో సోమవారం ఆయన ప్రసంగించారు. మన దేశంలో 62 శాతం జాతీయ ఆదాయం పట్టణ ప్రాంతాల నుంచే వస్తోందని ఇటీవ ల అహ్లూవాలియా కమిటీ తన నివేదికలో పేర్కొన్నదని గుర్తు చేశారు. పట్ణణ ప్రాంతాలకు కేటాయిస్తున్న నిధులు, వసూలు చేస్తున్న పన్నులపై మరింత పరిశోధన అవసరం ఉందన్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ వృత్తి పన్ను వసూలును గ్రేటర్ హైదరాబాద్‌కు ఇవ్వాలని, అలా చేస్తే మొదటి ఏడాదిలోనే నాలుగింతలు వసూలు చేసి చూపిస్తామని అర్థికమంత్రి ఈటెల రాజేందర్‌ను కోరారు. వాహనాల పన్నును ప్రస్తుతం వాణిజ్య పన్నుల శాఖ వసూలు చేస్తోందని తెలిపారు. ఏడాదికి రూ.100 కోట్లు వసూలవుతున్నాయని చెప్పారు. గ్రేటర్‌కు కేటాయిస్తే మొదటి ఏడాదే రూ.500 కోట్లు వసూలు చేసి చూపిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. గత ఏడాది గత ఏడాది రూ. 747 కోట్లు ఆస్తిపన్ను వసూలు కాగా ప్రస్తుతం రూ.1023 కోట్లు వసూలు చేశామని తెలిపారు. హైదరాబాద్‌కే అవకాశం మెట్రో పొలిస్ సదస్సు నిర్వహణకు జోహెన్నెస్‌బర్గ్ నగరం పోటీకి వచ్చినా హైదరాబాద్‌కే అవకాశం దక్కిందని స్పెషల్ కమిషనర్ ఎ.బాబు అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 50 దేశాలలోని 136 పట్టణాలకు చెందిన 1900 మంది ప్రతినిధులు సదస్సులో పాల్గొంటారన్నారు. 380 మంది అంతర్జాతీయ స్థాయి ప్రతినిధులు ఉంటారని తెలిపారు. అక్టోబర్ 6 నుంచి 9 వరకు మెట్రో పోలిస్ సదస్సులో చర్చలు సాగుతాయని చెప్పారు. 10న ఔటర్ రింగు రోడ్డు, ఐటీ కారిడార్ తదితర ప్రాంతాలలో క్షేత్ర పర్యటన ఉంటుందన్నారు. సదస్సులో భాగంగా వరల్డ్ క్లాస్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తామన్నారు. ‘షహర్ నామా’ పేరిట జరిగే ఫిల్మ్ ఫెస్టివల్లో పట్టణ సమస్యలపై రూపొందించిన 40 సినిమాలు ప్రదర్శిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భార త రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్, రాజేంద్ర పచోరి వంటి ప్రముఖుల ప్రసంగాలు ఉంటాయన్నారు. 100 స్మార్ట్ సిటీస్ ఏర్పాటు చేసే అంశంపై చర్చ ఉంటుందన్నారు. ఈ సమావేశంలో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ డెరైక్టర్ జనరల్ కె.రామకృష్ణారావు, అదనపు డీజీ డాక్టర్ బి.గంగయ్య, డెరైక్టర్లు వి.శ్రీనివాసాచారి, షబ్బీర్ షేక్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంటి నుంచే చూడొచ్చు!
మెట్రో పొలిస్ సదస్సు ప్రత్యక్ష ప్రసారం చురుగ్గా ఏర్పాట్లు సాక్షి, సిటీబ్యూరో: నగరంలో వచ్చేనెల 6- 10వ తేదీల జరుగనున్న మెట్రోపొలిస్ సదస్సును టీవీల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులు పర్యటించే మార్గాల్లోని అన్ని విభాగాలకు చెందిన రహదారులకు మరమ్మతులు చేయనున్నారు. మెట్రో రైలు కారిడార్లలో బారికేడ్లను తగ్గించనున్నారు. వాహనాలు సాఫీగా ప్రయాణించేందుకు వీలుగా సదస్సు పూర్తయ్యే వరకు కేవలం పని జరుగుతున్న ప్రాంతంలోనే బారికేడ్లు ఉంచుతారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్ద జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాలను జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ విలేకరులకు తెలిపారు. ఆ వివరాల ప్రకారం...9వ తేదీన సదస్సులో రాష్ట్రపతి పాల్గొంటారు. సదస్సును ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లు చేస్తున్నారు. చార్మినార్, ఐటీ కారిడార్, ట్యాంక్‌బండ్‌లపై ప్రతినిధుల క్షేత్రస్థాయి పర్యటనలు సైతం ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. టీవీ ప్రసారాలతో పాటు ఇంటర్నెట్ ద్వారా సైతం వీక్షించే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతినిధులకు అందజేసేందుకు ఏరోజుకారోజు నాలుగు పేజీల పత్రికను వెలువరించనున్నారు. సదస్సు విశేషాలు, ఫొటోలు తదితరమైన వాటితో నాలుగు రోజుల పాటు ఈ సంచికలు వెలువరిస్తారు. సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులు, వీఐపీలకు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి, జీహెచ్ఎంసీలు రాత్రి విందు ఇవ్వనున్నాయి. 6వ తేదీన తారామతి బారాదరిలో పర్యాటకశాఖ, 7న ఫలక్‌నుమాలో ముఖ్యమంత్రి కేసీఆర్, 8న జలవిహార్‌లో జీహెచ్ఎంసీ మేయర్ మాజిద్ ఈ విందులిస్తారు. సదస్సు నిర్వహణకు పట్టణ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ రూ.కోటి, హెచ్ఎండీఏ రూ.2 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 కోట్లు నిధులిచ్చాయని కమిషనర్ తె లిపారు. ఎస్బీహెచ్ స్పాన్సర్‌షిప్‌గా బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ జస్బీర్సింగ్ అనేజా రూ.30 లక్షల చెక్కునిచ్చారని పేర్కొన్నారు. అంతర్జాతీయ సంస్థలు సైతం స్పాన్సర్‌షిప్‌నకు ముందుకొస్తున్నాయని కమిషనర్ సోమేశ్ కుమార్ వెల్లడించారు.