
'కేసీఆర్ మాటలకు చేతలకు పొంతన ఉండదు'
హైదరాబాద్: ఎంసెట్ కౌన్సెలింగ్పై రెండు రాష్ట్రాల ఉన్నత విద్యామండళ్ల తీరు విద్యార్థులను ఆందోళనకు గురి చేస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకోవద్దని ఆయన ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. తక్షణమే ఎంసెట్ అడ్మిషన్లు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారని పొంగులేటి ఆరోపించారు. కేసీఆర్ మాటలకు, చేతలకు పొంతన ఉండదని ఎద్దేవా చేశారు. ఈ నెల 19న నిర్వహించే సామాజిక సర్వేను మూడు దశల్లో నిర్వహించాలని ప్రభుత్వానికి సూచించారు. రాష్ట్రంలో విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు.