eamcet councelling
-
కంప్యూటర్ సైన్స్‌లో పెరిగాయ్..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీ లలో కంప్యూటర్ సైన్స్ కోర్సులకు సంబంధించిన సీట్లు భారీగా పెరిగాయి. ప్రైవేటు కాలేజీల విజ్ఞప్తి మేరకు పెద్దగా డిమాండ్ లేని బ్రాంచీల నుంచి ఇతర బ్రాంచీలకు 7,635 సీట్లను మార్చగా.. అద నంగా 6,930 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో చాలా వరకు కంప్యూటర్ సైన్స్ బ్రాంచీలకు సంబంధించిన సీట్లేకావడం గమనార్హం. మొత్తంగా డిమాండ్ ఉన్న బ్రాంచీలకు సంబంధించి ఈసారి (2023–24) కొత్తగా 14,565 ఇంజనీరింగ్ సీట్లను ఎంసెట్ కౌన్సెలింగ్‌లో చేర్చుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన సీట్లలో దాదాపు 10,195 సీట్లు కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తారు. ఇలా ఇంజనీరింగ్‌లో సీట్ల పెంపుతో రూ.27.39 కోట్ల మేర అదనంగా ఫీజు రీయింబర్స్మెంట్ భారం పడుతుందని ప్రభుత్వం పేర్కొంది. విద్యార్థుల నుంచి డిమాండ్ లేని బ్రాంచీలు, సీట్లు రద్దు చేసుకుని.. ఆ మేర డిమాండ్ ఉన్న కోర్సుల్లో పెంచుకోవడానికి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ఇటీవల అనుమతించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వందకుపైగా కాలేజీలు దరఖాస్తు చేసుకున్నాయి. సుమారు 50కిపైగా కాలేజీలు సీఎస్సీ, ఇతర కంప్యూటర్ కోర్సుల్లో భారీగా సీట్లు పెంచుకున్నాయి. మొత్తం 1.15 లక్షలకు చేరిన సీట్లు.. రాష్ట్రవ్యాప్తంగా మొదటి దశ ఎంసెట్ కౌన్సెలింగ్‌లో 66,112 సీట్లను అందుబాటులో పెట్టారు. తాజాగా పెరిగిన సీట్లను కూడా చేరిస్తే ఈ సంఖ్య 80,677 సీట్లకు పెరుగుతోంది. యాజమాన్య కోటా సీట్లనూ కలిపితే రాష్ట్రంలో 1.15 లక్షల ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉండనున్నాయి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్‌తోపాటు మరికొన్ని కంప్యూటర్ కోర్సుల్లో గత సంవత్సరం 41,506 సీట్లు అందుబాటులో ఉండగా.. ఈసారి 56 వేల వరకూ చేరనున్నాయి. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్‌తోపాటు ఇతర బ్రాంచీల్లో గత ఏడాది 29,780 సీట్లు ఉండగా.. ఈసారి 22,145 సీట్లకు తగ్గిపోనున్నాయి. ఎంసెట్ షెడ్యూల్లో మార్పు ఇప్పటికే ఎంసెట్ మొదటి విడత కౌన్సెలింగ్ చివరి దశకు చేరకుంది. ఈ నెల 12న సీట్ల కేటా యింపు జరగాల్సి ఉంది. కొత్త సీట్లకు అనుమతి ఇవ్వడంతో.. వాటిని అందుబాటులోకి తెచ్చేందుకు ఎంసెట్ షెడ్యూల్లో మార్పులు చేశారు. దీని ప్రకారం ఈ నెల 8 వరకూ అభ్యర్థులు స్లాట్ బుక్ చేసుకోవచ్చు. 9న సర్టిఫికెట్ల వెరిఫికేషన్, 12 వరకు ఆప్షన్లు ఇచ్చుకునే అవకాశం కల్పించారు. ఈ నెల 16న సీట్ల కేటాయింపు చేపడతారు. సీటు వచ్చిన అభ్యర్థులు ఈ నెల 22వ తేదీలోగా కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. రెండో దశ ఎంసెట్ కౌన్సెలింగ్ ఈ నెల 24 నుంచి మొదలవుతుంది. పెంపు మంచి నిర్ణయం.. ఇంజనీరింగ్ సీట్ల పెంపు నిర్ణయం ఆహ్వాని ంచదగ్గ పరిణామం. దీనివల్ల అదనంగా 10వేల మందికిపైగా సీట్లు పొందే అవ కాశం వస్తుంది. డిమాండ్ ఉన్న కోర్సుల్లో చేరాలనుకునే వారికి ఇది ప్రయోజనకరం. – ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఫ్యాకల్టీకి ఉద్యోగ భద్రత కల్పించాలి సంప్రదాయ బ్రాంచీల్లో సీట్లు తగ్గించడం వల్ల కొన్ని సెక్షన్లు రద్దవు తాయి. ఈ కారణంగా ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న అధ్యాపకులను తొలగించే ప్రమాదం ఉంది. వారికి ఉద్యోగ భద్రత కల్పించాలి. అవసరమైతే వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి మిగతా బ్రాంచీల్లో బోధించే నైపుణ్యం కల్పించాలి. – వి.బాలకృష్ణ, సాంకేతిక, వృత్తి విద్యా ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ వాయిదా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ ఫీజులపై స్తబ్దత కారణంగా ఈ నెల 28 నుంచి జరగాల్సిన ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ వాయిదా పడింది. ఈ కౌన్సెలింగ్‌ను వచ్చే నెల 11 నుంచి చేపడతామని సాంకేతిక విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ ఓ ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించి అక్టోబర్ 16న సీట్ల కేటాయింపు ఉంటుందని వివరించారు. రాష్ట్రంలో ఈ నెల 6న తొలి విడత ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు చేపట్టారు. మొత్తం 71,286 సీట్లుంటే.. విద్యార్థుల ఆప్షన్లకు అనుగుణంగా 60,208 సీట్లను భర్తీ చేశారు. 11,078 సీట్లు మిగిలిపోయాయి. వీటికితోడు కొత్తగా అందుబాటులోకి వచ్చిన కంప్యూటర్ కోర్సుల సీట్లను కలిపి రెండో విడత కౌన్సెలింగ్‌లో భర్తీ చేయాల్సి ఉంది. అన్నీ కలిపి 25 వేలకుపైగా సీట్లు ఉండవచ్చని అంచనా వేశారు. ఫీజుల నిర్ధారణలో జాప్యం రెండో విడత కౌన్సెలింగ్ నాటికి ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల ఫీజులను నిర్ధారించాలనుకున్నారు. ఇందుకు అనుగుణంగానే ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఎఫ్ఆర్సీ) కసరత్తు చేసింది. జూలైలోనే ఎఫ్ఆర్సీ రాష్ట్రవ్యాప్తంగా కాలేజీల ఆడిట్ నివేదికలను పరిశీలించి, ఫీజులను నిర్ణయించింది. వివిధ వర్గాల నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా 2019–22 బ్లాక్ పీరియడ్‌లో ఉన్న ఫీజులనే కొనసాగించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. కానీ ఈ నిర్ణయంపై 81 కాలేజీలు కోర్టును ఆశ్రయించడం, కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో ఎఫ్ఆర్సీ తిరిగి కాలేజీల ఆడిట్ నివేదికలను పరిశీలించింది. తొలిదశ ఆడిట్ నివేదికల పరిశీలనలో తప్పులు జరిగాయని, మళ్లీ పరిశీలించి వాటిని సరిచేశామని ప్రకటించింది. ఈ మేరకు చాలా కాలేజీల ఫీజులు తగ్గుతున్నట్టు ఎఫ్ఆర్సీ వర్గాలు తెలిపాయి. మరోవైపు రెండో విడత చర్చల్లో తమ వాదన వినిపించేందుకు సరైన సమయం ఇవ్వలేదని కొన్ని కాలేజీలు ఎఫ్ఆర్సీకి అప్పీలు చేశాయి. దీనితో ఆయా కాలేజీల ప్రతినిధులతో మరో దఫా చర్చించాలని నిర్ణయించారు. ఫీజుల వ్యవహారం తేలకుండా కౌన్సెలింగ్‌కు వెళ్లడం సరికాదని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. ఈ మేరకు కౌన్సెలింగ్ వాయిదా పడింది. -
తెలంగాణ ఎంసెట్: కంప్యూటర్ సైన్స్‌పైనే అందరి గురి
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్‌పై విద్యార్థులు ఈసారి పెద్దఎత్తున ఆశలు పెంచుకున్నారు. మునుపెన్నడూ లేని రీతిలో పోటీ పడుతున్నారు. ఆప్షన్ల గడువు బుధవారంతో ముగుస్తుండగా.. మంగళవారం సాయంత్రానికి 34 వేల మంది.. దాదాపు 15 లక్షలకుపైగా ఆప్షన్స్ ఇచ్చినట్టు ఉన్నత విద్యామండలి అధికారి ఒకరు తెలిపారు. సాధారణంగా మొదటి విడతతో పోలిస్తే రెండో విడతలో విద్యార్థుల సంఖ్య తగ్గుతుంది. గతంలో 25 వేల మందే రెండో కౌన్సెలింగ్‌లో పాల్గొనే వారు. తొలిదశలో 61,169 సీట్లు కేటాయించగా.. 46,322 మంది మాత్రమే సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు. వీరిలో 3 వేల మంది వచ్చిన సీటును గడువులోగా వదులుకున్నారు. వీళ్లంతా నచ్చిన కాలేజీ, బ్రాంచ్‌లో మేనేజ్మెంట్ కోటా సీట్లు పొందిన వారు లేదా జాతీయ కాలేజీల్లో కచి్చతంగా సీటొస్తుందని భావించే వారు. చదవండి: తెలంగాణ: సరెండర్ సెలవుల డబ్బులేవి? ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్‌కే ప్రాధాన్యత ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో హైకోర్టు ఆదేశంతో ఇంజనీరింగ్ సీట్లు పెరిగాయి. ఇవి కన్వీనర్ కోటా కింద 4,404 వరకూ ఉన్నాయి. ఇందులో సింహభాగం కంప్యూటర్ సైన్స్ కోర్సులే ఉన్నాయి. వీటిపైనే విద్యార్థులు ఎక్కువగా ఆశలు పెంచుకున్నారు. పెరిగిన సీట్లలో ఎక్కడో అక్కడ కన్వీనర్ కోటాలో సీటు వస్తుందని ఆశిస్తున్నారు. రెండో కౌన్సెలింగ్‌లో పోటీ పెరగడానికి ఇదే ప్రధాన కారణమని ఉన్నత విద్యా మండలి అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకూ వచి్చన ఆప్షన్స్‌లో 89 శాతం కంప్యూటర్ సైన్స్, దాని అనుబంధ కోర్సులకే మొదటి ప్రాధాన్యత ఇచ్చినట్టు సమాచారం. ఇప్పటికే మొదటి దశలో సీటొచ్చిన అభ్యర్థులు పెరిగిన సీట్లను అంచనా వేసుకుని రెండో దశలో కంప్యూటర్ కోర్సుల కోసం పోటీ పడ్డారు. ఇందులోనూ మొదటి ప్రాధాన్యత ఆరి్టఫీషిÙయల్ ఇంటిలిజెన్స్‌కే ఇవ్వడం విశేషం. ఎట్టకేలకు జేఎన్టీయూహెచ్ అనుమతి పెరిగిన సీట్లపై తొలుత పేచీ పెట్టిన జేఎన్టీయూహెచ్ ఎట్టకేలకు అనుమతి మంజూరు చేసింది. విశ్వవిద్యాలయం గుర్తింపు ఉంటే తప్ప కౌన్సెలింగ్‌కు వెళ్లే అవకాశం లేదని ఉన్నత విద్యామండలి తెలిపింది. ఒకదశలో ప్రత్యేక కౌన్సెలింగ్ ద్వారా పెరిగే సీట్లను భర్తీ చేయాలనుకున్నారు. కానీ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో వర్సిటీ కూడా మొత్తం సీట్లకు ఆమోదం తెలపకతప్పలేదు. అయితే, పెరిగిన సీట్లకు అనుకూలంగా వసతులు, ఫ్యాకల్టీని మెరుగుపరచాలని వర్సిటీ ప్రైవేటు కాలేజీలకు షరతు విధించింది. పెరిగిన సీట్లు ఇవీ... బ్రాంచ్ సీట్లు సీఎస్ఈ ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ 1,533 ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ డేటాసైన్స్ 840 సీఎస్సీ (డేటాసైన్స్) 672 ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ 546 సీఎస్ఈ (సైబర్ సెక్యూరిటీ) 231 సీఎస్ఈ 168 కంప్యూటర్ సైన్స్ డిజైన్ 168 ఎల్రక్టానిక్స్ కమ్యూనికేషన్ 126 సీఎస్ఈ (ఐవోటీ) 42 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 21 ఈఈఈ 21 సివిల్ ఇంజనీరింగ్ 21 మైనింగ్ ఇంజనీరింగ్ 15 -
ఎంసెట్: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
-
‘ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్లో ఎలాంటి మార్పు లేదు’
-
‘ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్లో మార్పుల్లేవు’
సాక్షి, అమరావతి : రేపటి ఎంసెట్ కౌల్సిలింగ్ షెడ్యూల్లో ఎలాంటి మార్పులు లేవని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. బుధవారం నుంచి యధావిధిగా ఎంసెట్ కౌన్సిలింగ్ జరుగుతుందన్నారు. విద్యార్థులు తమకు నచ్చిన కాలేజీలకు అప్షన్లు ఇవ్వాలని సూచించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ప్రకారం రేపటి నుంచి యధావిధంగా జరుగుతుందన్నారు. ఈ మేరకు ఉన్నత విద్యామండలి కార్యదర్శికి ఆదేశాలు కూడా జారీ చేశామన్నారు. రిజర్వేషన్లు, ఫీజులపై త్వరలో స్పష్టత ఇస్తామని పేర్కొన్నారు. రాబోయే రాష్ట్ర బడ్జెట్లో విద్యాశాఖకు పెద్దపీట వేస్తామన్నారు. విద్యాశాఖలోని ఖాళీ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిందని, త్వరలోని అన్ని ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. అమ్మఒడి పథకాన్ని ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకూ అమలు చేస్తామని తెలిపారు. రెండేళ్లలో అన్ని ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేస్తామని మంత్రి సురేష్ వ్యాఖ్యానించారు. -
నేటి నుంచి ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్
-
విశాఖ ఎంసెట్ కౌన్సిలింగ్ వద్ద గందరగోళం
-
గుర్తింపు రద్దయిన కాలేజీలకు ఊరట..
-
'కేసీఆర్ మాటలకు చేతలకు పొంతన ఉండదు'
హైదరాబాద్: ఎంసెట్ కౌన్సెలింగ్‌పై రెండు రాష్ట్రాల ఉన్నత విద్యామండళ్ల తీరు విద్యార్థులను ఆందోళనకు గురి చేస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకోవద్దని ఆయన ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. తక్షణమే ఎంసెట్ అడ్మిషన్లు నిర్వహించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారని పొంగులేటి ఆరోపించారు. కేసీఆర్ మాటలకు, చేతలకు పొంతన ఉండదని ఎద్దేవా చేశారు. ఈ నెల 19న నిర్వహించే సామాజిక సర్వేను మూడు దశల్లో నిర్వహించాలని ప్రభుత్వానికి సూచించారు. రాష్ట్రంలో విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు.