బీజేపీ నేతలవి పగటి కలలు
హైదరాబాద్:
తెలంగాణలో తాము అధికారంలోకి వస్తామంటూ బీజేపీ నేతలు పగటి కలలు కంటున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి ఎద్దేవ చేశారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. భద్రాచలానికి కేంద్రమంత్రులను తీసుకొచ్చిన బీజేపీ నేతలకు పోలవరం ముంపు ప్రాంతాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఫెయిల్ అయిందని టీడీపీ నేత రేవంత్ రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఆముదం చెట్టులా మారిందన్నారు. ఓటుకు కోటు కేసులో రేవంత్ రెడ్డి వ్యవహారం ఎక్కడికి పోయిందని పొంగులేటి నిలదీశారు. ఆ వ్యవహారంలో కేసీఆర్, చంద్రబాబు కుమ్మక్కయ్యారని ఆరోపించారు.