హైదరాబాద్ : తెలంగాణలో కరెంట్ కష్టాలకు కేసీఆరే కారణమని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. కేసీఆర్ అసమర్థత వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ప్రజలు కరెంట్ కష్టాలు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన చట్టం తెలంగాణకు కేటాయించిన 54 శాతం విద్యుత్ వాటాను కేసీఆర్ సాధించలేకపోయారని విమర్శించారు.
కేంద్రం నుంచి అదనపు విద్యుత్ పొందటంలో సీఎం విఫలం అయ్యారని పొన్నాల వ్యాఖ్యానించారు. ఈ వైఫల్యాలకు కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హయాంలో రైతులకు ఉచిత విద్యుత్ అందించామని, రైతుల విద్యుల్ బకాయిలు రద్దు చేసిన ఘనత తమ పార్టీదేనన్నారు. రైతులకు భరోసా కల్పించేందుకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నట్లు పొన్నాల తెలిపారు.