
స్వతంత్రులపై అధికార దాడులు
► ప్రచారం చేయకుండా నిర్బంధం
► ప్రేక్షకపాత్ర పోషించిన పోలీసులు
► జల్లో పెరిగిన సానుభూతి
► ఫలితాలపై ప్రభావం చూపనున్న ఓవరాక్షన్ ?
వరంగల్ : గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నిక పోలింగ్ సందర్భంగా తూర్పు నియోజకవర్గ పరిధిలో పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థులపై అధికార పార్టీ నేతలు పలు చోట్ల దా డులు చేశారు. టీఆర్‌ఎస్ నుంచి టిక్కెట్లు రాకపోవడంతో పలువురు స్వతంత్రులుగా బరిలోకి దిగడంతో పాటు.. గెలిస్తే టీఆర్‌ఎస్‌లోకి వస్తామంటూ ప్రచారం చేసుకున్నా రు. అయితే, అధికార పార్టీ అభ్యర్థులను గెలిపించాలన్న ధ్యేయంతో ఆ పార్టీ నేతలు పోలీసులు సహాయంతో స్వతంత్ర అభ్యర్థులను గత నాలుగు రోజులుగా ఇక్కట్లకు గురిచేశారు. పోలింగ్ సమయంలోనూ స్వతంత్ర అభ్యర్థులకు ఓటర్లు మొగ్గు చూపడంతో భరించలేని అధికార పార్టీ అభ్యర్థులు స్వతంత్రులపై విరుచుకుపడ్డారు. వా రి తరపున ప్రచారం చేస్తున్న వారిని పోలీ సులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇదంతా గమనిస్తున్న ఓట ర్లలో స్వతంత్రుల పట్ల సానుభూతి పెరిగిం ది. ఈ సానుభూతి ఎవరిని ముంచిందో ఫలితాలు వస్తే కానీ తెలియదు.
15వ డివిజన్‌లో....
వరంగల్ ఎల్‌బీ నగర్ మాసూం ప్రభుత్వ పాఠశాల పోలింగ్ బూత్ వద్ద అధికార పార్టీ అభ్యర్థి భర్త సాదిక్.. టీఆర్‌ఎస్ రెబల్ స్వ తంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న శారద జోషి భర్త సురేష్ జోషిపై దాడికి పాల్పడ్డాడు. విష యం తెలిసిన స్థానిక ఓటర్లు ఇదే అన్యా య మంటూ సురేష్‌జోషికి అండగా నిలిచారు. బందోబస్తులో ఉన్న పోలీసులు ఇంతేజార్‌గంజ్ స్టేషన్‌కు సమాచారం అందించడంతో సీఐ భీంశర్మ పోలింగ్ బూత్‌కు వచ్చి సురేష్‌జోషిని అక్కడే నిర్భందించారు. తనపై దాడి చేసిన వారిని వదిలి దెబ్బలు తగిలినా తన ను నిర్భంధించిడం న్యాయమా అని ప్రశ్నిం చినా సమాధానం ఇవ్వలేదని బాధితుడు వాపోయాడు.
చివరకు దాడి చేసిన అభ్యర్థి భర్తను పోలింగ్ బూత్ వద్దకు ర ప్పించగా.. ప్రచారం కోసం తనను వదలాలని సురేష్ జోషి ప్రాధేయపడినా పట్టించుకోలేదు. విషయం తెలుసుకున్న ఏసీపీ సురేంద్రనాథ్ వచ్చి పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి వెళ్లా రు. చివరకు సురేష్ జోషి భార్య, అభ్యర్థి శారదజోషి, సోదరితో పాటు పలువురు ధర్నాకు దిగడం, ప్రచారం చేయకుండా ఇం ట్లో ఉంటామని హామీ ఇవ్వడంతో రెండు గంటల అనంతరం పోలీసులు జోషిని వది లిపెట్టారు. అయితే, సురేష్‌పై దాడి విష యం డివిజన్‌లో ప్రచారం కావడంతో ఓట ర్లలో ఆయనపై సానుభూతి పెరిగి గెలిచే అవకాశాలు మెరుగైనట్లు సమాచారం. డివి జన్‌లో మొత్తం 12,539ఓట్లు ఉండగా 4,550(36.29 శాతం) ఓట్లు పోలయ్యా యి. ఇంత తక్కువ పోల్ కావడంతో గె లు పుపై ప్రభావం పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
13, 15వ డివిజన్లలో..
వరంగల్ 13వ డివిజన్‌లోని స్వతంత్ర అ భ్యర్థిగా మాజీ కార్పొరేటర్ ఓని భాస్కర్ సతీమణి పోటీకి దిగారు. స్థానికుడు కావ డంతో పాటు సామాజిక వర్గ ఓట్లు భాస్కర్‌కు గెలిచే అవకాశమున్నట్లు ప్రచారం సా గింది. దీంతో అధికార పార్టీనేతలు పోలీ సుల సహకారంతో భాస్కర్ ప్రచారం చేసుకోకుండా అడ్డంకులు సృష్టించారు. డివిజన్‌లో భాస్కర్ పట్ల సానుభూతి పెరగడం వల్ల పోలింగ్‌లో ఓట్లు ఎక్కువ పడు తున్నట్లు ఫ్రచారం సాగింది. దీంతో పో లింగ్ కేంద్రాల వద్ద ప్రచారం నిర్వహిస్తు న్న స్వతంత్ర అభ్యర్థి అనుచరులను పోలీ సులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటన సైతం అధికార పార్టీ అభ్యర్థికి ప్రతి కూలంగా మారినట్లు చెబుతోంది. ఇక పో లింగ్ ముగిసిన అనంతరం 20వ డివిజన్ లో రె బల్ అభ్యర్థి అనుచరులపై అధికార పార్టీ అభ్యర్థి అనుచరులు దాడి చేయగా, ఇరువర్గాలకు గాయాలైనట్లు సమాచారం. అంతకుముందు ఇదే డివిజన్‌లోని శాంతి నగర్ సన్‌రైస్ స్కూల్‌లోని పోలింగ్ కేం ద్రం వద్ద టీఆర్‌ఎస్, స్వతంత్య్ర అభ్యర్థి మ ద్దతుదారుల నడుమ ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. పోలీసులు ఇరువర్గాల ను చెదరగొట్టి పంపించారు. కాగా, తూ ర్పు పరిధి అధికార పార్టీ అభ్యర్థుల పట్ల పోలీసుల ఓవరాక్షన్ ఏ పరిణా మానికి దారి తీసిందో ఓట్ల లెక్కింపుతో తెలుస్తుం ది. అయితే, పోలింగ్ ప్రశాంతంగా జరిగిన ట్లు పోలీసులు ప్రకటించడం విశేషం.