ప్రజాప్రతినిధులకు ఈటెల విందు
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్ సమావేశాలు ముగిసిన నేపథ్యంలో ప్రజాప్రతినిధులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ విందును ఏర్పాటుచేశారు. అసెంబ్లీ పక్కనేఉన్న పబ్లిక్‌గార్డెన్‌లో శని వారం రాత్రి ఏర్పాటు చేసిన ఈ విందుకు పలుపార్టీల ప్రజాప్రతినిధులు హాజరయ్యా రు.
శాసనమండలి చైర్మన్ కె.స్వామిగౌడ్, స్పీకరు ఎస్.మధుసూదనాచారి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రులు టి.రాజయ్య, మహమూద్‌అలీ, మంత్రులుహరీశ్ రావు, నాయిని నర్సింహారెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, జోగురామన్న విందులో పాల్గొన్నారు.
టీడీఎల్‌పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఆ పార్టీ సభ్యులు సాయన్న, సండ్ర వెంకటవీరయ్య, గాంధీ, గోపీనాథ్‌తోపాటు బీజేఎల్పీనేత కె.లక్ష్మణ్, కాంగ్రెస్ సభ్యులు రామ్మోహన్‌రెడ్డి, భాస్కర్‌రావుతో పాటు ఎమ్మెల్సీలు కూడా హాజరయ్యారు.