Public Garden
-
తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోతోంది
-
పబ్లిక్ గార్డెన్ లో జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
-
మిగతా రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శం : గవర్నర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 71వ గణతంత్ర వేడుకలు వైభవంగా జరిగాయి. పబ్లిక్ గార్డెన్లో ఆదివారం ఉదయం గవర్నర్ తమిళసై సౌందరరాజన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా త్రివిధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ఆమె తెలంగాణ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ ప్రసంగిస్తూ.. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఎన్నో రకాల సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ అధిగమించారని ప్రశంసించారు. ఎన్నో అంశాల్లో తెలంగాణ మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. కొత్త చట్టాలతో అవినీతి రహిత రాష్ట్రంగా పేరు గాంచిన తెలంగాణ ప్రజల పనుల్లో ఆలస్యం కాకుండా సేవలు అందిస్తోందని పేర్కొన్నారు. పల్లె ప్రగతితో తెలంగాణ గ్రామాలు సత్ఫలితాలను సాధించాయన్నారు. కొత్త రెవెన్యూ చట్టంతో అవినీతికి తావు లేని స్వచ్ఛమైన రెవెన్యూ పాలన అందించాలని నిర్ణయించామన్నారు. మిషన్ భగీరథ, 24 గంటల కరెంటు, కొత్త ఇరిగేషన్ ప్రాజెక్టులతో సాగు, తాగు నీరందిస్తున్నారని వ్యాఖ్యానించారు. అనంతరం అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జైహింద్, జై తెలంగాణ అంటూ తెలుగులో ప్రసంగం ముగించారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్, మంత్రులు, పలువురు అధికారులు హాజరయ్యారు. జెండా ఎగరేయడంలో ఆలస్యం పబ్లిక్ గార్డెన్లో గవర్నర్ తమిళసై సౌందరరాజన్ జాతీయ జెండా ఎగురవేయడంలో కాస్త ఆలస్యం జరిగింది. త్రివర్ణ పతాకం ఎగరకుండా అధికారులను ముప్పుతిప్పలు పెట్టింది. దీంతో గవర్నర్ మరోసారి జెండా ఎగరవేయగా అది పైకి వెళ్లిందే తప్ప ఎగరలేదు. దీంతో జెండాను కిందకు దించి మళ్లీ ఎగురవేశారు. ఇక ఈ సమయంలో జెండా ఆవిష్కరణ జరగకముందే జాతీయ గీలాపనను రెండు మూడు సార్లు ఆలపించడంతో సీఎం కేసీఆర్ విచారంగా చూశారు. అనంతరం గవర్నర్ మరోసారి జెండాను ఎగరేసే ప్రయత్నం చేయగా ఎట్టకేలకు త్రివర్ణ పతాకం రెపరెపలాడటంతో అందరూ జాతీయ గీతాన్ని ఆలపించారు. కోర్టులో గణతంత్ర వేడుకలు మరోవైపు తెలంగాణ హైకోర్టులో గణతంత్ర వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్ర సింగ్ చౌహాన్ జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ వేడుకల్లో పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. -
కిడ్నాప్ అయ్యానంటూ మామకు అల్లుడి ఫోన్
సాక్షి ప్రతినిధి, వరంగల్: హన్మకొండలో నివాసముంటున్న ఓ రిటైర్డ్ ఉపాధ్యాయుడికి గురువారం మధ్యాహ్నం 12.30 గంటలకు హైదరాబాద్‌లో ఉంటున్న అల్లుడి నుంచి ఫోన్ వచ్చింది. ‘మామయ్య నేను హైదరాబాద్‌లో వేరే చోట ఉన్నాను. అర్జంటుగా పద్నాలుగు లక్షల రూపాయలు రెడీ చేయండి. ఎందుకు ? ఏమిటీ అనే వివరాలు మీకు తర్వాత చెప్తా’ అంటూ ఫోన్ కట్ చేశాడు. ఆ తర్వాత అదే నంబర్‌కు మళ్లీమళ్లీ ఫోన్ చేస్తే... అవతలి వైపు వ్యక్తులు మారుతున్నారు.. కానీ డబ్బులు సిద్ధం చేయాలనే డిమాండ్ మారడం లేదు. దీంతో అల్లుడు కిడ్నాప్ అయ్యాడని భావించిన మామ నగదు సిద్ధం చేసే పనిలో పడిపోయాడు. ఒక్కరోజులో అంత డబ్బు సర్దుబాటు చేయలేక ఇబ్బందిపడ్డాడు. శ్రేయోభిలాషుల ద్వారా ఓ మాజీ ఎంపీకి సమస్య చెప్పుకున్నాడు. అలాఅలా విషయం పోలీసులకు చేరింది. పబ్లిక్ గార్డెన్లో అనుమానితులు అదుపులోకి.. ఒకేసారి రూ.14 లక్షలు సర్దుబాటు చేయలేమని, కేవలం రూ.4 లక్షలు ఇవ్వగలనంటూ మామ ఫోన్లో అవతలి వ్యక్తులకు చెప్పాడు. ఈ నగదుతో తాము హైదరాబాద్ రాలేమని, మీరే వరంగల్ రావాలంటూ కోరాడు. సాయంత్రం పబ్లిక్ గార్డెన్లో నగదు తీసుకునేలా ఒప్పందం కుదిరింది. దీంతో హైదరాబాద్ నుంచి డబ్బుల కోసం ముగ్గురు వ్యక్తులు బయల్దేరారు. గురువారం సాయంత్రం 6.30 గంటలకు పబ్లిక్ గార్డెన్‌కు వచ్చి డబ్బులు తేవాల్సిందిగా ఫోన్ చేశారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు మఫ్టీలో అక్కడే వేచి ఉన్నారు. తీరా డబ్బులు ఉన్నట్లుగా భావిస్తున్న బ్యాగును ఇచ్చే సమయంలో మఫ్టీలో ఉన్న పోలీసులు రంగ ప్రవేశం చేసి హైదరాబాద్ నుంచి వచ్చిన వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ హఠత్పరిమాణానికి వారిలో ఒకరు పారిపోగా .. ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అక్కడే ఆశ్చర్యపోయే విషయాలు వెల్లడయ్యాయి. బాకీ తగాదాయే కారణం.. ఉమ్మడి వరంగల్ నగరానికి చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్‌లో దిల్‌సుఖ్‌నగర్‌లో స్థిరపడ్డాడు. అక్కడ ఇతర పార్ట్నర్లతో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు. ఈ వ్యాపారంలో పార్ట్నర్లకు భారీ మొత్తంలో బాకీపడ్డాడు. బాకీ ఎంతకు ఇవ్వకపోవడంతో హైదరాబాద్‌లో ఓ పోలీస్‌స్టేషన్‌కు పం చాయతీ చేరింది. అక్కడ విషయం సెటిల్ చేసేందుకు రంగం సిద్ధమైంది. భాగస్వాములు,పోలీసుల నుంచి ఒత్తి డి పెరగడంతో సదరు రియల్ ఎస్టేట్ వ్యాపారి... తన అప్పులు తీర్చేందుకు డబ్బులు ఇవ్వాలంటూ వరంగల్‌లో ఉన్న మామను ఫోన్లో కోరాడు. మొత్తం విషయం చెప్పకుండా అర్జంటుగా డబ్బులు కావాలంటూ కంగారుగా, గాబరాగా చెప్పడంతో అల్లుడు కిడ్నాప్ అయినట్లుగా మామ భయపడ్డాడు. చివరకు కిడ్నాప్ జరగలేదని, పార్ట్ నర్ల మధ్య తగదా అని తేలడంతో కథ సుఖాంతమైంది. -
ప్రజాప్రతినిధులకు ఈటెల విందు
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్ సమావేశాలు ముగిసిన నేపథ్యంలో ప్రజాప్రతినిధులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ విందును ఏర్పాటుచేశారు. అసెంబ్లీ పక్కనేఉన్న పబ్లిక్‌గార్డెన్‌లో శని వారం రాత్రి ఏర్పాటు చేసిన ఈ విందుకు పలుపార్టీల ప్రజాప్రతినిధులు హాజరయ్యా రు. శాసనమండలి చైర్మన్ కె.స్వామిగౌడ్, స్పీకరు ఎస్.మధుసూదనాచారి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రులు టి.రాజయ్య, మహమూద్‌అలీ, మంత్రులుహరీశ్ రావు, నాయిని నర్సింహారెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, జోగురామన్న విందులో పాల్గొన్నారు. టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఆ పార్టీ సభ్యులు సాయన్న, సండ్ర వెంకటవీరయ్య, గాంధీ, గోపీనాథ్‌తోపాటు బీజేఎల్పీనేత కె.లక్ష్మణ్, కాంగ్రెస్ సభ్యులు రామ్మోహన్‌రెడ్డి, భాస్కర్‌రావుతో పాటు ఎమ్మెల్సీలు కూడా హాజరయ్యారు. -
ప్రముఖుల లేఖలు: చలం
కన్యాకుమారి ఇంద్రజాలం రామేశ్వరం- 25-5-1934 ఈ ద్వీపమంతా తిరిగాం. ఏ ప్రదేశం నుంచి అయినా సరే కొబ్బరి తోపుల్లో నుంచి నీలంగా సముద్రం మెరుస్తో కనబడుతుంది, ఎంతో అందంగా. ఏ చోటనైనా సరే ఇసిక బంగారం మల్లే మెరుస్తో కనబడుతుంది. ఈ ద్వీపమంతా శ్రీరాముడు తిరిగిన చిహ్నలతో ప్రజ్వరిల్లుతోంది. భక్తి ఏమాత్రం లేని నాకు ఆలయం చూస్తే ప్రేమ. జాజిపువ్వులు...పువ్వుల్లో కెల్లా ఇష్టమైనవి. చందనం, నాదస్వరం, హారతి అన్ని నాకు అమితంగా ఇష్టం. ఏమీ లేని బైరాగి, పెద్ద స్తంభాలు, ప్రాకారాలు, మెత్తని కాంతి, శ్రావ్యమైన సంగీతం, గొప్ప గోపురాలు, విగ్రహాలు, ఆస్పత్రుల నర్సుల వలే ఎప్పుడూ సేవ చేస్తో తిరిగే పూజార్లు. అట్లా ఆ ప్రదేశానికి అతుక్కుని పోతారు. ఇవాలో రేపో కుర్తాళం వెడుతున్నాం, అక్కణ్ణించి ఇంకా దక్షిణానికి, బహుశా కన్యాకుమారి దాకా. తోవలో రామనాథ్ చూస్తాం, రాముడితో నిండిన ఇంకో ప్రదేశం. తిరువనంతపురం, పబ్లిక్ గార్డెన్ 9-6-1034 ఈ తోట అద్భుతమైన అందాలు ఒలికే ప్రదేశం. ఈ పరగణానికి ఎండాకాలం అనేది లేదు. కన్యాకుమారి దివ్యమైన లావణ్యాన్ని చూడగలిగాను. ఆకారంలో, రంగులలో ఇంత అందమిచ్చే స్థలాన్ని వొదిలి వెళ్లవలసి రావడం హృదయాన్ని చీల్చేస్తుంది. ఈ సముద్రాన్ని, అడవుల్ని, కొండల్ని వొదిలి బెజవాడలో సిరా మచ్చల బల్లముందు కూచోవడం తప్పదనుకుంటే బతుకు మీద రోత కలుగుతుంది. ఈ సౌందర్యాన్ని చూసి, జీవితమంతా ఈ జ్ఞాపకంతో బాధపడే గతిని తప్పించుకున్న మిమ్మల్ని తలచుకొని ఈర్ష్యపడతాను. బీదరికంలోనూ, ఈ దేశపు స్త్రీల ముఖం మీద తృప్తిలో మునిగిన మాధుర్యం కనబడుతుంది. మీరు ఉంటే ఎంత బావుండేది! కన్యాకుమారి ఇంద్రజాలమల్లే ఉంది. - చింతా దీక్షితులుకు చలంగారి ఉత్తరాల నుంచి. -
డీఈఓ వర్సెస్ ఉపాధ్యాయ సంఘాలు
ఆందోళన బాటలో ఉపాధ్యాయులు లిఖితపూర్వక సమాధానాన్ని తిరస్కరించిన సంఘాలు నేడు హన్మకొండలో ర్యాలీ, కార్యాలయం ఎదుట ధర్నా విద్యారణ్యపురి, న్యూస్‌లైన్: జిల్లా విద్యాశాఖాధికారిగా ఉన్న డాక్టర్ ఎస్.విజయ్‌కుమార్ - ఉపాధ్యాయ సంఘా ల నడుమ ఏర్పడిన అగాధం ఆందోళనలు చేపట్టే స్థాయికి చేరింది. ఉపాధ్యాయుల పని తీరును సలహాలు, సూచనలతో మార్చాల్సిన అధికారి భయాందోళనకు గురిచేస్తున్నారని ఆరోపిస్తున్న వివిధ ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు చివరకు సమన్వయ కమిటీగా ఏ ర్పడి ర్యాలీ, ధర్నాలు చేపడుతామని హెచ్చరించారు. ఈ ఆందోళనల్లో భాగంగా మంగళ వారం ర్యాలీ, ధర్నా నిర్వహించనున్నారు. నేడు ర్యాలీ, ధర్నా వైఖరి మార్చుకోవడమే కాకుండా సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్ చేస్తూ.. స్పందిం చని పక్షంలో మంగళవారం ధర్నా చేయనున్నట్లు గతంలోనే డీఈఓ విజయ్‌కుమార్‌కు ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు నోటీసు ఇ చ్చారు. దీనికి ఆయన రాతపూర్వకంగా ఇచ్చి న సమాధానం సంతృప్తికరంగా లేదని పే ర్కొంటూ ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన లు చేపట్టి తీరుతామని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం 10గంటలకు హన్మకొండ పబ్లిక్ గార్డెన్ నుం చి ర్యాలీగా బయలుదేరి, హన్మకొండలోని డీఈఓ కార్యాలయం వద్ద సాయంత్రం 4గంటల వరకు ధర్నా నిర్వహించనున్నట్లు తెలి పారు. ఈ మేరకు ఉపాధ్యాయ సంఘాల సమన్వయ కమిటీలో ఉన్న ఏపీటీఎఫ్, యూ టీఎఫ్, డీటీఎఫ్, టీడీటీఎఫ్, టీపీఆర్టీ యూ, టీఎన్‌యూఎస్, టీఎస్సీ ఎస్టీయూఎస్ జిల్లా బాధ్యులు ఎం.శ్రీనివాస్, కడారి భోగేశ్వర్, కె.సోమశేఖర్, టి.లింగారెడ్డి, ఎం డీ.అబ్దుల్ అలీం, సంకా భద్రినారాయణ, సయ్యద్ గౌస్, విష్ణువర్ధన్, ఎల్.సంజీవరెడ్డి, గోపీచంద్ తెలిపారు. డీఈఓ అవినీతి, అక్ర మాలపై ఉన్నతాధికారులు విచారణ జరి పిం చాలని కోరారు. అలాగే, పెండింగ్‌లో ఉన్న వేతన కోతలు, సస్పెన్షన్లను క్రమబద్ధీకరించాలని, అన్ని రకాల డిప్యూటేషన్లు రద్దుచే సి ఆయా ఉపాధ్యాయులను పాఠశాల విధుల కు పంపించాలని, పనిచేయని కాలానికి డ్యూ టీ సర్టిఫికెట్లు ఇవ్వడం మానుకోవాలని డిమాండ్ చేశారు. ఇంకా డీఈఓ కార్యాలయ సుందరీకరణ పేరుతో వసూలు చేసిన నిధు ల ఖర్చుపై సోషల్ ఆడిట్ చేయించాలని కోరారు. ఇంకా పలు డిమాండ్ల పరిష్కారాని కి మంగళవారం చేపట్టనున్న ర్యాలీ, ధర్నాకు ఉపాధ్యాయులు అధికసంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు. నోటీసు ఇచ్చిన తర్వాత కూడా... పాఠశాలల తనిఖీ పేరిట డీఈఓ చేస్తున్న సస్పెన్షన్లు, ఇంక్రిమెంట్ల కోత తమను ఆందోళనకు గురిచేస్తోందని పేర్కొంటూ ఉపాధ్యా య సంఘాల బాధ్యులు ధర్నా నోటీసు ఇ చ్చారు. అయితే, నోటీసు ఇచ్చాక ఆయన వైఖరిలో మార్పు వస్తుందేమోనని భావించ గా.. డీఈఓ అంతగా పట్టించుకోలేదని తెలుస్తోంది. డీఈఓగా విధులు, బాధ్యతలు తన కు తెలుసునని పేర్కొన్న ఆయన సక్రమంగా విద్యాబోధన చేయకుంటే చర్యలు తప్పవని చెబుతూ పర్యవేక్షణ కొనసాగించారు. ధర్నా నోటీసు అందాక ఆరు పాఠశాలలను తనిఖీ చేసిన డీఈఓ విజయ్‌కుమార్.. ఓ ఎయిడెడ్ పాఠశాలలోని ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేయాలని యాజమాన్యాన్ని ఆదేశించారు. అలాగే, వర్ధన్నపేటలోని నందనం జెడ్పీ హైస్కూల్లో స్కూల్ అసిస్టెంట్‌ను సస్పెండ్ చేయడమే కాకుండా మరో ముగ్గురి ఇంక్రిమెంట్లలో కోత విధించారు. ఇదేకాకుం డా జనగామ డివిజన్లోని రెండు ఉన్నత పా ఠశాలల్లో తనిఖీ చేసి 24మంది ఉపాధ్యాయులకు ఒక్కో ఇంక్రిమెంట్ కట్ చేయడం గమనార్హం. కాగా, ధర్నా నోటీసు అందుకున్న డీఈఓ.. కోఆర్డినేషన్ సమావేశం ఏర్పాటుచేసి ఉపాధ్యాయ సంఘాల బాధ్యులను ఆ హ్వానించగా వారు హాజరుకాలేదు. సమస్య ల పరిష్కారానికి రాతపూర్వక హామీ ఇవ్వాలని కోరగా, ఆయన కొన్ని అంశాలపై అందజేశారు. అయితే, వాటితో సంతృప్తి చెందని ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు ధర్నాకు సిద్ధమయ్యారు. ఇలా డీఈఓ - ఉపాధ్యాయు ల నడుమ పెరిగిన అగాధం ధర్నాకు దారి తీయగా.. ఇది ఇంకా ఎక్కడి వరకు వెళ్తుందో వేచి చూడాల్సిందే. ధర్నాకు పీఆర్టీయూ దూరం ఉపాధ్యాయ సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టనున్న ఆం దోళన కార్యక్రమాల్లో తమ సంఘం పాల్గొన డం లేదని ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూని యన్(పీఆర్టీయూ) జిల్లా అధ్యక్షుడు చీకటి సమ్మయ్య, ప్రధాన కార్యదర్శి పి.శ్రీపాల్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సంఘాలు అంద జేసిన నోటీసుకు డీఈఓ ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం సంతృప్తికరంగా ఉండడం తో ధర్నాలో పాల్గొనొద్దని నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు. -
కేయూ యువజనోత్సవాలు
కేయూలో యువజనోత్సవాలు సోమవారం కనులపండువగా ప్రారంభమయ్యూయి. ఆరు రాష్ట్రాల్లోని 19 యూనివర్సిటీల విద్యార్థులతో క్యాంపస్ సందడిగా మారింది. పబ్లిక్ గార్డెన్లో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. డప్పు వాయిద్యాల మధ్య నగరంలో నిర్వహించిన శోభాయూత్ర ఆకట్టుకుంది.జ్యోతి ప్రజ్వలన చేస్తున్న హైకోర్టు జడ్జి జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డియువజనోత్సవాలకు హాజరైన విద్యార్థులుమాట్లాడుతున్న హైకోర్టు జడ్జి జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డిహాజరైన ప్రముఖులు, విద్యార్థులుమాట్లాడుతున్న కేయూ వీసీ ప్రొఫెసర్ వెంకటరత్నంవిద్యుత్ వెలుగుల్లో ఆడిటోరియంమాక్నాలబ్ చతుర్వేది నేషనల్ యూనివర్సిటీ విద్యార్థులుచిందేస్తున్న స్వామివివేకానంద టెక్నికల్ యూనివర్సిటీ, భిలాయ్ విద్యార్థులురవిశంకర్శుక్లా యూనివర్సిటీ రాయ్‌పూర్ విద్యార్థులుఇందిరా కళాసంగీత్ విద్యాలయం, చత్తీస్‌గఢ్ విద్యార్థుల నృత్య ప్రదర్శనజెండా ఊపి శోభాయాత్రను ప్రారంభిస్తున్న కేయూ వీసీవేషధారణలో చత్తీస్‌గఢ్ విద్యార్థులుబుందేల్ఖండ్ యూనివర్సిటీ విద్యార్థులుకేయూ విద్యార్థినుల రిహార్సల్స్సీవీ రామన్ యూనివర్సిటీ, బిలాస్పూర్ విద్యార్థులుఏఐఎస్ఈసీటీ యూనివర్సిటీ విద్యార్థులునృత్యం చేస్తున్న బుందేల్‌ఖండ్ యూనివర్సిటీ విద్యార్థులుగిరిజన నృత్యం చేస్తున్న విద్యార్థులుహరిదాసు, జోకర్ వేషధారణల్లో.. -
నేటి నుంచి కాకతీయ ఉత్సవాలు
సాక్షి, హన్మకొండ : ఎట్టకేలకు కాకతీయ ఉత్సవాలు పునః ప్రారంభం కానున్నా యి. మంగళవారం నుంచి మూడు రోజుల పాటు గణపురం మం డల కేంద్రంలోని గణపేశ్వరాలయం (కోట గుళ్లు)లో ఉత్సవాలు జరగనున్నాయి. సెప్టెంబర్ 27న హన్మకొండ పబ్లిక్ గార్డెన్‌లోని నేరేళ్ల వేణుమాధవ్ కళాప్రాంగణంలో ముగింపు కార్యక్రమం నిర్వహించనున్నారు. మంగళవారం సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభం కానున్న ఉత్సవాలకు ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డితోపాటువరంగల్ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, కలెక్టర్ జి.కిషన్, ఐటీడీఏ పీఓ సర్ఫరాజ్ అహ్మద్ హాజరుకానున్నారు. నాలుగు నెలల సుదీర్ఘ విరామం అనంతరం ఉత్సవాలు పునఃప్రారంభం కావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సారి స్థానిక కళాకారులకు పెద్దపీట కాకతీయ ఉత్సవాల్లో భాగంగా స్థానిక కళాకారులను ప్రోత్సహించాలని నిర్ణయించారు. కానీ, ఇప్పటివరకు జరిగిన కార్యక్రమాల్లో స్థానికేతరులకే పెద్దపీట వేశారు. 2012 డిసెంబర్లో జరిగిన ప్రారంభోత్సవంలో రాధారాజారెడ్డి, ఎల్లా వెంకటేశ్వర్లు వంటి ప్రసిద్ధులు. ఆ తర్వాత ఏప్రిల్‌లో మరోసారి జరిగిన ఉత్సవాల్లో పద్మభూషణ్ స్వప్నసుందరి, పద్మశ్రీ ఆనందశంకర్ వంటి స్థానికేతరులైన జాతీయ స్థాయి కళాకారులకే ఎక్కువ ప్రాధాన్యం దక్కిం ది. అరుుతే ఈ సారి గతానికి భిన్నంగా స్థానిక కళాకారుల ప్రదర్శనలకు అవకాశం కల్పిం చారు. బుక్క సాంబయ్య, ఆజ్మీర గోవింద్‌నాయక్, పోరిక శ్యాం, నారగోని విశ్వనాథం, వెంకట్రాం నాయక్, గడ్డం సారయ్య వంటి జిల్లాకు చెందిన ప్రముఖ కళాకారులు తమ బృందాలతో ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ఈ మూడు రోజుల వేడుకల్లో జిల్లాకు చెందిన 300 మంది కళాకారులకు తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు. వీరితోపాటు జిల్లాకు చెందిన ప్రముఖ కళాకారుడు చుక్కా సత్తయ్య బృందం.. శివసత్తుల ప్రదర్శన ఇవ్వనుంది. వీడని నిధుల గ్రహణం ఏప్రిల్‌లో కాకతీయ ఉత్సవాలు జరిగాయి. నాలుగు నెలల విరామం తర్వాత కాకతీయ ఉత్సవాలు పునఃప్రారంభమవుతున్నా... నిధులకు గ్రహణం వీడలేదు.కాకతీయ ఫెస్టివల్ నిర్వహణకు నిధుల కేటాయిస్తామన్న ప్రభుత్వం చేతులెత్తేసింది. దీంతో 2012 డిసెంబర్ నుంచి 2013 ఏప్రిల్ వరకు ప్రతి నెలా ఉత్సవాల నిర్వహణ కష్టంగా మారింది. చివరకు కాకతీయ ఫెస్టివల్లో ప్రదర్శనలు ఇచ్చిన కళాకారులకు పారితోషికం చెల్లించలేని స్థితి ఏర్పడింది. ఫలితంగా మే, జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన కార్యక్రమాలు కొన్ని వాయిదా పడగా.. మరి కొన్ని రద్దయ్యూరుు. ప్రస్తుతం రూ. 30 లక్షలు విడుదలైనప్పటికీ ఇందులో సగానికి పైగా నిధులు కళాకారుల పారితోషికాలకే సరిపోతాయి. ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి నిధులు మంజూరు చేయించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. లేని పక్షంలో డిసెంబర్ వరకు నిరాటంకంగా ఉత్సవాల నిర్వహణ జిల్లా యంత్రాంగానికి తలకుమించిన భారంగా మారే అవకాశం ఉంది. కార్యక్రమ విశేషాలు కుప్ప పద్మజా బృందంలో మొత్తం 12 మంది సభ్యులున్నారు. డి ప్రవళిక, ఆర్.నిమిష, ఎల్.హర్షిణి, బి.శ్వేత, కె.కల్యాణి, ఎ.అనుశ్రీ, పి.చైతన్య, కె.ప్రణవ, పి.సౌందర్య, జి.వర్షిక, సహ్యూలతో కూడిన బృందంతో 45 నిమిషాల పాటు కూచిపూడి నృత్య ప్రదర్శన ఉంటుంది. ఈ బృందంలోని సభ్యులందరూ వరంగల్ జిల్లాకు చెందిన వారే. కన్నా సాంబయ్య బృందం వీర బ్రహ్మేంద్రస్వామి జననం బుర్రకథ ఉంటుంది. కన్నా సాంబయ్యతోపాటు ఎం.సదానందం, ఆర్.అశోక్ ఉన్నారు. ఈ కళారూపం గంటపాటు ఉంటుంది. కోటగుళ్లలో ఏర్పాట్లు పూర్తి గణపురం : కాకతీయ ఉత్సవాల నిర్వహణకు గణపురం మండల కేంద్రంలోని కోటగుళ్లు ముస్తాబయ్యూరుు. ఏర్పాట్లు పూర్తికావచ్చాయి. ఉత్సవాలకు ఇన్చార్జ్గా ఉన్న ఐటీడీఏ పీఓ సర్ఫరాజ్ అహ్మద్ రెండు పర్యాయాలు గణపేశ్వరాలయాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రవీంద్రనాథ్, అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ప్రతిఒక్కరికి బాధ్యతలను అప్పగించారు. కార్యక్రమాలు నిర్వహించే వేదికతోపాటు సౌండ్స్, లైటింగ్, తాగునీటి వసతి, ఉత్సవాలకు వచ్చే కళాకారులు, అతిథులకు చేసే ఏర్పాటపై సోమవారం సాయంత్రం ఎంపీడీఓ గుళ్లపల్లి విద్యాసాగర్, తహసీల్దార్ రజితతో ఐటీడీఏ పీఓ మాట్లాడారు. అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యూయని అహ్మద్‌కు వారు తెలిపారు. కాగా, మూడు రోజులుగా వర్షాలు పడుతుండడంతో దేవాలయ ప్రాంగణంలో అక్కడక్కడ నీరు నిలిచింది. దీంతో తహసీల్దార్ రజిత పర్యవేక్షణలో సిబ్బంది 150 ట్రాక్టర్ల మొరం తెప్పించి బురద గుంటలను పూడ్చారు.మట్టి కోట చుట్టు ఉన్న పిచ్చి మొక్కలను తొలగించేందుకు మూడు రోజులుగా 300 మంది కూలీలతో పనులు చేయించారు. ఇదిలా ఉండగా, విద్యుత్ సౌకర్యం కోసం ట్రాన్స్‌కో అధికారులు రెండు ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశారు. ముందు జాగ్రత్తలో భాగంగా మూడు జెనరేటర్లను అందుబాటులో ఉంచారు. ఉత్సవాలకు వచ్చే సందర్శకుల కోసం ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో రెండు ప్రాంతాల్లో 10 మరుగుదొడ్లను నిర్మించారు. కేటీపీపీ అధికారులు మూడు రోజులపాటు ప్రతి రోజు 20 వేల తాగునీటి ప్యాకెట్లను పంపిణీ చేయనున్నారు.