33రూ.1.83 లక్షల కోట్లు! | 2018-19 Annual Budget in the Assembly | Sakshi
Sakshi News home page

33రూ.1.83 లక్షల కోట్లు!

Published Wed, Mar 14 2018 3:33 AM | Last Updated on Mon, Mar 25 2019 3:09 PM

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం వరు సగా ఐదోసారి భారీ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనుంది. 2018–19 ఆర్థిక సంవత్స రానికి ఇంచుమించుగా రూ.1.83 లక్షల కోట్ల బడ్జెట్‌కు రూపకల్పన చేసింది. సాధా రణ ఎన్నికలకు ముందు ప్రవేశపెడుతున్న పూర్తిస్థాయి బడ్జెట్‌ కావటంతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌ గురువారం అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. గతేడాది రాష్ట్ర ప్రభు త్వం రూ.1.49 లక్షల కోట్ల బడ్జెట్‌ ప్రవేశ పెట్టింది. వివిధ పథకాలు, అభివృద్ధి పను  లకు వెచ్చించే ప్రగతి పద్దుకు రూ.88,038 కోట్లు, ప్రభుత్వ విభాగాలు కార్యకలా పాలు, ఉద్యోగుల జీతభత్యాలు, కార్యాల యాల నిర్వహణకు రూ.61,607 కోట్లు కేటాయించింది.

ఈసారి రెండు భారీ పథకాలను అమలు చేయనున్నట్లు ప్రభు త్వం ముందుగానే ప్రకటించింది. దీంతో ప్రగతి పద్దు రూ.లక్ష కోట్లు దాటే అవకాశా లున్నాయి. ద్రవ్యలోటు ఉన్నప్పటికీ ఈ ఏడాది కూడా రెవెన్యూ మిగులు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. రైతు లక్ష్మి, రైతన్నకు బీమా పథకాలను ఈసారి బడ్జెట్‌లో ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించనుంది. ఖరీఫ్‌ నుంచే ఎకరానికి రూ.8 వేల చొప్పు న వ్యవసాయానికి పెట్టుబడి సాయం పథకాన్ని అమలు చేస్తామని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఇప్పటికే ప్రకటిం చారు.

‘రైతు లక్ష్మి’పేరుతో బడ్జెట్‌లో ప్రభు త్వం ఈ పథకానికి పెద్దపీట వేయనుంది. ఈ పథకానికి దాదాపు రూ.11 వేల కోట్లు కేటాయించనుంది. దీంతోపాటు 70 లక్షల మంది రైతులకు రూ.5 లక్షల ఆరోగ్య బీమా పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని నిర్ణయించింది. నిరుడు సాగు నీటి రంగానికి రూ.25 వేల కోట్లు కేటా యించగా.. ఈసారి కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యంతో గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.30 వేల కోట్లు కేటాయించే అవకాశాలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement