నేడు అక్కడక్కడ భారీ వర్షాలు | rains predicted in Telugu states for next 24 hours | Sakshi
Sakshi News home page

నేడు అక్కడక్కడ భారీ వర్షాలు

Published Wed, Sep 27 2017 2:34 AM | Last Updated on Tue, Sep 4 2018 5:02 PM

rains predicted in Telugu states for next 24 hours - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ తీరం వెంబడి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణలో బుధవారం అక్కడక్కడ ఉరుములతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ వై.కె.రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఆ తర్వాత మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.

ఇదిలావుండగా గత 24 గంటల్లో బూర్గుంపాడు, పినపాక, నల్లగొండల్లో 7 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. మహబూబాబాద్, మిర్యాలగూడ, ముల్కలపల్లి, బయ్యారం, ఖమ్మం పట్టణం, గోవిందరావుపేట, హయత్‌నగర్‌లలో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం రికార్డు అయింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement