
మరిపెడ (డోర్నకల్): మదర్సాలో ఓ విద్యార్థి ఏకధాటిగా 8 గంటలపాటు ఖురాన్ మొత్తం పఠనం చేశాడు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పాతర్లపాడుకి చెందిన సయ్యద్ ఆసిఫ్ మహబూబాబాద్ జిల్లా మరి పెడ మండల కేంద్రంలోని మదర్సాలో ఏడో తరగతి చదువుతున్నాడు. ఖురాన్‌ను కంఠస్థం చేసేందుకు సాధారణంగా మూడేళ్లు పడుతోందని, ఆసిఫ్ 15 నెలల్లో పూర్తి చేశాడని మదర్సా బోధకుడు మౌలానా తెలిపారు. మంగళవారం ఆసిఫ్‌ను ముస్లిం మత పెద్దలు సన్మానించారు.