సిద్ధమైన యంత్రాంగం ఐదు చోట్ల పోలింగ్ కేంద్రాలు
1207 మంది ఓటర్లు
6న ఓటర్ల తుది జాబితా
అర్బన్ ఎమ్మెల్యేలకే అవకాశం!
రెండో స్థానంపై అస్పష్టత
సన్నద్ధమవుతున్న పార్టీలు
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వహణ కోసం జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. గత నెలతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న టి.భానుప్రసాద్‌రావు పదవీకాలం ముగియడంతో ఎన్నిక జరగనుంది. జూన్‌లో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. రాష్ర్ట విభజన అనంతరం వాటా తేలడంతో, ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియకు ఇప్పటికే ఎన్నికల కమిషన్ శ్రీకారం చుట్టింది. ముందుగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఖాళీ అయిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక లకు వచ్చే నెలలో నోటిఫికేషన్ జారీ కానుంది. అందులో మన జిల్లా కూడా ఉంది.
కలెక్టర్ నీతూప్రసాద్ ఎన్నికల అధికారిగా, జారుుంట్ కలెక్టర్ పౌసుమిబసు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఈఆర్వో)గా వ్యవహరించనున్నారు. ఈ నెల 18న ఓటర్ల జాబితాను ప్రచురించిన అధికారులు, 25 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. 25 నుంచి 30 వరకు వచ్చిన అభ్యంతరాలపై విచారణ చేపట్టిన అనంతరం, జూన్ 6న ఓటర్ల తుది జాబితా ప్రచురించనున్నారు. జాబితా ప్రకటన అనంతరం ఎప్పుడైనా నోటిఫికేషన్ వెలువడే అవకాశముంది.
-కరీంనగర్ సిటీ
కరీంనగర్ సిటీ : ఎమ్మెల్సీ ఎన్నిక కోసం జిల్లా వ్యాప్తంగా ఐదు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంతోపాటు జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, మంథని ఎంపీడీవో కార్యాలయాల్లో కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాలకు ఓటర్ల సంఖ్యను కూడా కేటాయించారు. ఏ ప్రాంతానికి చెందిన ఓటర్లకు కూడా ఇబ్బంది కలగకుండా జిల్లా కేంద్రంతోపాటు డివిజన్ కేంద్రాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
అర్బన్ ఎమ్మెల్యేలకే అవకాశం!
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో జిల్లాలోని అర్బన్ ప్రాంతాల ఎమ్మెల్యేలే ఓటు హక్కు వినియోగించుకోనున్నా రు. మున్సిపల్ చట్టం ప్రకారం పరోక్ష ఎన్నికల్లో ఓటు హ క్కు వినియోగించుకున్న ఎక్స్ అఫిషియో సభ్యులకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటు హక్కు ఉంటుంది. పంచాయతీరాజ్ యాక్ట్‌లో ఈ అవకాశం లేదు. దీంతో అర్బన్ ప్రాంత ఎమ్మెల్యేలకే అవకాశం దక్కనుంది. అధికారికంగా ఇంకా ప్రకటించనప్పటికీ, తొమ్మిది మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, ఒక ఎమ్మెల్సీకి స్థానిక సంస్థల ఎ మ్మెల్సీ ఎన్నికలో ఓటు ఉంది.
రెండు నగరపాలక సంస్థ లు, నాలు గు పురపాలక సంస్థలతో కలిపి జిల్లాలో మొత్తం 11 మున్సిపాల్టీలున్నాయి. ఈ 11 మున్సిపాల్టీలకు తొమ్మి ది మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు, ముగ్గురు ఎ మ్మెల్సీలు ప్రా తినిథ్యం వహిస్తున్నారు. వీరిలో నిజామాబాద్ ఎంపీ కవిత, ఎమ్మెల్సీలు స్వామిగౌడ్, సుధాకర్‌రెడ్డి మినహా మిగతా వారంతా గత మున్సిపల్ చైర్మన్, మేయర్ ఎన్నికల్లో ఎక్స్‌అఫిషియో సభ్యుల హోదాలో జిల్లాలోని వివిధ మున్సిపాల్టీల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఈ లెక్కన ఇద్ద రు మంత్రులు ఈటెల రాజేందర్, కె.తారకరామారావుతోపాటు కరీంనగర్, పెద్దపల్లి, రామగుండం, జగిత్యాల, కోరు ట్ల, వేములవాడ, హుస్నాబాద్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, మనోహర్‌రెడ్డి, సోమారపు సత్యనారాయణ, టి.జీవన్‌రెడ్డి, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, చెన్నమనేని రమేష్‌బా బు, వి.సతీశ్‌బాబు, ఎమ్మె ల్సీ టి.సంతోష్‌కుమార్‌కు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటు హక్కు కల్పించారు.
మానకొండూరు, చొప్పదండి, ధర్మపురి, మంథని నియోజకవర్గాల పరిధిలో ము న్సిపాల్టీలు లేనందున, ఈ నలుగురు ఎమ్మెల్యేలకు ఓటు అవకాశం లేనట్లే. కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్ కరీంనగర్ నగరపాలక సంస్థ, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమ న్ రామగుండం నగరపాలక సంస్థలో ఎక్స్‌అఫిషియో స భ్యులుగా మేయర్ ఎన్నికల్లో ఓటు వేసినందున, వీరిద్దరూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కనిపిస్తోంది.
ఎమ్మెల్సీలు స్వామిగౌడ్, సుధాకర్‌రెడ్డి గత మున్సిపల్ ఎన్నికల్లో ఎక్స్‌అఫిషియో సభ్యులుగా నమోదు చేసుకోనందున, వీరికి అవకాశం లేనట్లేనని అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని 57 మంది జెడ్పీటీసీలు, 817 మంది ఎంపీటీసీలు, కౌన్సిలర్, కార్పొరేటర్లు, 9 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీ, ఒక ఎమ్మెల్సీ మొత్తం 1,207 మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అధికారికంగా ప్రకటించే నాటికి స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది.
రెండో స్థానంపై అస్పష్టత
జిల్లాకు రెండు స్థానిక సంస్థల స్థానాల కేటాయింపు విషయంలో ఇప్పటివరకు పూర్తి స్పష్టత రాలేదు. రాష్ట్ర విభజన నేపథ్యంలో పెరిగిన స్థానిక సంస్థల స్థానాన్ని జిల్లాకు కేటాయించారు. దీంతో జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీల సంఖ్య రెండుకు పెరిగింది. రెండోస్థానంపై ఇప్పటివరకు అధికారికంగా ఆదేశాలు రాలేదు. అయినా రెండు స్థానాల ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి.
ఎమ్మెల్సీ ఎన్నికకు రెడీ
Published Mon, May 25 2015 4:56 AM | Last Updated on Mon, Feb 17 2020 5:11 PM
Advertisement
Advertisement