సీఎం కాన్వాయ్‌లో ‘రక్షక్ ప్లస్’ | Reap the convoy, 'Rakshak Plus' | Sakshi
Sakshi News home page

సీఎం కాన్వాయ్‌లో ‘రక్షక్ ప్లస్’

Published Tue, Apr 14 2015 2:09 AM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM

సీఎం కాన్వాయ్‌లో ‘రక్షక్ ప్లస్’ - Sakshi

సీఎం కాన్వాయ్‌లో ‘రక్షక్ ప్లస్’

సాక్షి, హైదరాబాద్: రాష్ర్టంలో జరుగుతున్న వరుస సంఘటనల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు భద్రతను మరింత పటిష్టం చేశారు. మరో అధునాతన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని సీఎం కాన్వాయ్‌లో భద్రతా సిబ్బంది చేర్చింది. సీఎం భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇంటెలిజెన్స్ భద్రతా విభాగం ‘రక్షక్ ప్లస్’ అనే వాహనాన్ని ప్రత్యేకంగా తయారు చేయించింది. కాన్వాయ్ వరుసలో ఎస్కార్ట్ ముందు ఈ వాహనం ఉంటుందని అధికారులు తెలిపారు. ఎటువంటి దాడులనైనా ఎదుర్కొనేందుకు ఇందులో అధునాతన ఆయుధాలు కలిగిన నలుగురు గన్‌మెన్లు ఉంటారు. సీఎం జిల్లాల పర్యటనలకు వెళ్లే సమయంలో రక్షక్ ప్లస్ కాన్వాయ్‌లో ఉంటుందన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement