పెద్దపెల్లి-నిజామాబాద్ రైల్వేలైన్ పూర్తి చేయండిరైల్వే మంత్రికి నిజామాబాద్ ఎంపీ కవిత విజ్ఞప్తి
రాయికల్ :పెద్దపెల్లి-నిజామాబాద్ రైల్వేలైన్ కోసం రానున్న రైల్వే బడ్జెట్‌లో రూ.141 కోట్లను విడుదల చేయాలని నిజామాబా ద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కేంద్ర రైల్వేశా ఖ మంత్రి సురేష్‌ప్రభును కోరారు. ఈ మే రకు ఆమె బుధవారం ఢిల్లీలో కేంద్ర మం త్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు. 2015-16 ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో గత బడ్జెట్‌లో కేటారుుంచిన నిధులను పూర్తిస్థారుులో విడుదల చేయూలని విన్నవించారు. 1993లో ప్రారంభమైన పెద్దపెల్లి-నిజామాబాద్ రైల్వేలైన్ పనుల్లో జాప్యం జరుగుతోందని, త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
ఈ లైన్ పూర్తయితే నిజామాబాద్, కరీంనగర్, అదిలాబాద్, వరంగల్ జిల్లా వాసులతో పాటు పొరుగు రాష్ట్రాలై న మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వాసులకు ప్ర యాణ భారం తగ్గుతుందన్నారు. పసుపు రైతులు, వ్యాపారులకు ఎంతో దోహదపడుతుందన్నారు. తన విన్నపంపై రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించినట్లు కవిత ఫోన్‌లో సాక్షికి తెలిపారు.
రూ.141 కోట్లు విడుదల చేయండి
Published Thu, Feb 11 2016 3:25 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement
Advertisement