గ్రీన్‌హౌస్‌కు నిధుల పరిమితి లేదు
వ్యవసాయ మంత్రి పోచారం వెల్లడి
అగ్రికల్చర్ వర్సిటీలో
సుస్థిర వ్యవసాయంపై వర్‌కషాపు
సాక్షి, హైదరాబాద్: ప్రకృతి వ్యవసాయంపై ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలో పరిశోధనలు నిర్వహిస్తామని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. మంగళవారం వ్యవసాయవర్సిటీలో సుస్థిర సేద్యంపై వ్యవసాయ అధికారులకు నిర్వహించిన వర్క్‌షాప్‌లో మాట్లాడుతూ రైతులను సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లించాలనేది సర్కారు ఉద్దేశమని తెలిపారు. సేంద్రియ ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పిస్తామని, హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్‌లో ఉచితంగా స్టాల్స్ ఇచ్చి విక్రయించుకోవడానికి అవకాశం కల్పిస్తామన్నారు.
గ్రీన్‌హౌస్‌కు నిధులెన్నైనా ఇస్తాం..
గ్రీన్‌హౌస్ (పాలీహౌస్)ను రాష్ట్రవ్యాప్తంగా అమ లు చేస్తున్నామని, ఈ నేపథ్యంలో దానిని వెయ్యి ఎకరాలకే పరిమితం చేయబోమని పోచారం తెలిపారు. ఎన్ని ఎకరాలకైనా నిధులిస్తామని పేర్కొన్నారు. రైతు యూనిట్‌గా బీమా పాలసీ ఉండాలని ఇటీవల ఢిల్లీ సమావేశంలో పేర్కొన్నట్లు వివరించారు. వ్యవసాయశాఖలోని మూడు వర్సిటీలకు త్వర లో పాలకమండళ్లను ఏర్పాటు చేస్తామన్నారు.
సాగు ఎక్కువ.. అధికారులు తక్కువ: చిన్న, సన్నకారు అట్టడుగు రైతులకు అండగా ఉం డేందుకు సుస్థిరసేద్యాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని గ్రామీణాభివద్ధి శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. వ్యవసాయ అధికారుల సదస్సులో మాట్లాడుతూ తెలంగాణలో 40 లక్షల ఎకరాలలో వ్యవసాయం సాగవుతు న్నా కేవలం 6 వేల మంది అధికారులు ఉండడంతో రైతులకు సరైన సమాచారం అందడం లేదన్నారు. కార్యక్రమంలో పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి రేమండ్ పీటర్, వ్యవసాయ శాఖ కార్యదర్శి పార్థసారధి, ప్రకృతి వ్యవసాయశాఖ శాస్త్రవేత్త సుభాశ్ పాలేకర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రకృతి వ్యవసాయంపై పరిశోధనలు
Published Wed, Jul 1 2015 1:06 AM | Last Updated on Sun, Sep 3 2017 4:38 AM
Advertisement