ఖమ్మం : ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని సుబ్లేయిడ్ వద్ద పోలీసులు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కారులో కరీంనగర్ నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న రాజు అనే వ్యాపారి నుంచి రూ.8 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. పాలేరు ఉప ఎన్నిక జరుగుతున్న విషయం తెలియక జిల్లా సరిహద్దులోకి ప్రవేశించినట్లు వ్యాపారి తెలిపాడు. రైతులకు చెల్లించాల్సిన బకాయిల కోసం ఈ డబ్బు తీసుకెళ్తున్నట్లు వ్యాపారి పోలీసులకు తెలియజేశాడు. జిల్లాలోని పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక మే 16వ తేదీన జరగనుంది.ఈ నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఆ క్రమంలో పోలీసులు సదరు నగదును స్వాధీనం చేసుకున్నారు.