
ఎస్‌ఎస్ హబీబ్ బ్యూటీపార్లర్‌లో జ్యోతిప్రజ్వలన చేస్తున్న హీరోయిన్ పాయల్, నిర్వాహకులు
పాలమూరు : ఇటీవల విడుదలైన ఆర్‌ఎక్స్ 100 సినిమాతో కుర్రకారు మనుసు దోచేసి.. యువతను ఆకట్టుకున్న హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో సందడి చేశారు. జిల్లా కేంద్రంలోని న్యూటౌన్‌లో ఏర్పాటు చేసిన ఎస్‌ఎస్ హాబీబ్ బ్యూటీపార్లర్‌ను ఆమె ప్రారంభించారు. అదేవిధంగా మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ కూడా పాల్గొన్నారు. హీరోయిన్ పాయల్ ఉదయం 11గంటలకు జిల్లా కేంద్రానికి చేరుకోగా ఆమెను చూసేందుకు యువకులు పెద్దసంఖ్యలో వచ్చారు. దీంతో పార్లర్ వద్ద సందడి నెలకొంది. కార్యక్రమంలో పార్లర్ ఎండీలు నాగులవంచ వెంకట్, రాంరెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాధ, కౌన్సిలర్ కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.