బకాయిల వసూళ్లలో అలసత్వాన్ని సహించం
మహబూబ్‌నగర్ అర్బన్ :
లక్ష్యాల మేరకు విద్యుత్ బకాయిల ను వసూలు చేయడంలో ఆలసత్వాన్ని సహించేది లేదని టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మహబూబ్‌నగర్ పట్టణంలోని విద్యుత్ భవన్ సమావేశ మందిరంలో విద్యుత్ శాఖకు చెందిన డీఈఈలు, ఏఈఈలు తదితర క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందితో సీఎండీ సమీక్షా సమావేశం నిర్వహిం చా రు. ఐఆర్ పోర్టు మీటర్లు బిగించినందున బిల్లులు ఎక్కవ నమోదయ్యాని, అందుకే ఔట్ స్టాండింగ్ పెరిగిందని పలువురు ఏడీఈలు, ఏఈలు చెప్పడంతో సీఎండీ వారిపై మండిపడ్డారు. ఐఆర్ మీటర్ల సాకుచూపి టార్గెట్ల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని మందలించారు. ఈ సందర్భంగా డివిజన్, మండలాల వారీగా విద్యుత్ రెవెన్యూపై సమగ్ర వివరాలు సేకరించారు. వినియోగదారులకు విద్యు త్ సేవలు అందించడం ఎంత ముఖ్యమో వారినుంచి బకాయిలు వసూలు చే యడం కూడా అంతే ముఖ్యమన్నారు. పెండింగ్ బకాయిలను రాబట్టుకోవడం లో అధికారులు అన్నిరకాల ప్రయత్నా లూ చేయాలని సూచిం చారు. నెలాఖరులోగా గృహావసరాలు, వాణిజ్య సముదాయాల బిల్లులతో పాటు వ్యవసాయ రంగానికి సంబంధించిన బకాయిలను పూర్తిగా వసూలు చేయాలని, లేకుంటే కఠినచర్యలు ఉంటాయని హెచ్చరించా రు. కరెంటు ఉత్పత్తి, సరఫరా ఆశాజనకంగా ఉన్నప్పటికీ విని యోగదారులు పెండింగ్ బిల్లులు ఎం దుకు ఇవ్వరని గద్దించారు. ఖరీఫ్ పంట లు చేతికొస్తున్నందున రైతులకు నచ్చజెప్పి వ్యవసాయరంగ బకాయిలను 100 శాతం వసూ లు చేయలని సూచించారు. బిల్లుల వ సూలులో కొడంగల్ సబ్ డివిజన్ పూర్తి గా వెనుకబడిందని, ఇదే పరిస్థితి కొనసాగితే కఠినచర్యలు తీసుకుంటామని హె చ్చరించారు. సమావేశంలో సంస్థ ఆపరేషన్ విభాగం డెరైక్టర్ నాగేందర్, రంగారెడ్డి సీజీఎం పాండ్యానాయక్, వివిధ విభాగాల డీఈఈలు, తదితరులు పాల్గొన్నారు.