30, 31 తేదీల్లో సాక్షి భవిత ఎడ్యుకేషన్ ఫెయిర్
ఇంటర్ ఉత్తీర్ణులకు నిపుణుల మార్గనిర్దేశం
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ అర్హతతో లభించే ఉన్నత విద్య అవకాశాలు, భవిష్యత్తులో వాటి ద్వారా లభించే కెరీర్ అవకాశాలపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు సాక్షి మరోసారి మీ ముందుకొస్తోంది. ఇందుకోసం ఈ నెల 30, 31 తేదీల్లో రెండు రోజులపాటు సాక్షి భవిత ఎడ్యుకేషన్ ఫెయిర్ - 2015ను నిర్వహించనుంది. ఖైరతాబాద్‌లోని ది ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ ప్రాంగణంలో నిర్వహించే ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్‌లో ఇంజనీరింగ్, మెడికల్ తదితర కోర్సుల నిపుణులతోపాటు కెరీర్ కౌన్సెలర్లు పాల్గొననున్నారు. విద్యార్థులకు ఉన్నత విద్య పరంగా అందుబాటులో ఉన్న అవకాశాలు, ఇంజనీరింగ్ కోర్సులు, కాలేజీల ఎంపిక విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బెస్ట్ బ్రాంచ్‌లు తదితర అంశాలపై సూచనలు అందించనున్నారు.
ఇంజనీరింగ్, మెడికల్ కోర్సులు మాత్రమే కాకుండా ఇంటర్మీడియెట్ అర్హతగా ఉజ్వల భవిష్యత్తును అందించే పలు ప్రత్యామ్నాయ కోర్సుల గురించి కూడా అవగాహన కల్పించనున్నారు. రెండు రోజుల పాటు ఉదయం పది గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు జరిగే ఈ ఫెయిర్‌లో పలు కళాశాలలు కూడా పాలుపంచుకోనున్నాయి. విద్యార్థులతోపాటు, వారి తల్లిదండ్రుల్లోనూ కలిగే అనేక సందేహాలను నివృత్తి చేసే విధంగా నిర్వహించనున్న సాక్షి భవిత ఎడ్యుకేషన్ ఫెయిర్‌కు ప్రవేశం ఉచితం. ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్‌కు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ (ఐఏఆర్‌ఈ) అసోసియేట్ స్పాన్సర్‌గా, రేడియో సిటీ (91.1 ఎఫ్.ఎం.) రేడియో పార్టనర్‌గా వ్యవహరిస్తున్నాయి.