- వెయిటింగ్ లేకుండా ఇసుక లోడింగ్
- ఏటూరు ఇసుక రవాణాలో అక్రమాలు
- కొందరు లారీ యజమానుల అత్యాశ
- ఒక్కో లారీకి రోజుకు వెయ్యి వసూలు
- మైనింగ్, పోలీసు అధికారుల తీరుపై విమర్శలు
- కలెక్టర్ కరుణ దృష్టిసారిస్తే మేలు
- ఇసుక రవాణా చేసి ఎక్కువ ఆదాయం సమకూర్చు
కోవాలని కొందరు అక్రమాలకు తెరలేపారు. స్థానికంగా ఉన్న మైనింగ్, పోలీసు అధికారులకు లారీకి రూ.1000 చొప్పన ఇచ్చి.. ఏటూరుకు తమ లారీ వచ్చిన వెంటనే లోడింగ్ చేసేలా కొత్త వ్యవహారం మొదలుపెట్టారు.
సాక్షి ప్రతినిధి, వరంగల్ : ఏటూరు ఇసుక క్వారీకి అవినీతి చీడ పడుతోంది. రాష్ర్టంలోనే ఆదర్శంగా నిలుస్తున్న క్వారీ.. మెల్లిగా ఇసుక రవాణా చేసే లారీ యజమానులు, వ్యాపారుల అత్యాశతో అభాసుపాలవుతోంది. లాభార్జనే ధ్యేయంగా కొందరు లారీ యజమానులు వ్యవస్థనే పక్కదారి పట్టిస్తున్నారు. అధిక ట్రిప్పుల ఇసుకను రవాణా చేయూలనే ఉద్దేశంతో అడ్డదారులు తొక్కుతున్నారు. సాధారణంగా ఒక లారీకి మూడు రోజులకు ఒక ట్రిప్పు వంతున వస్తుంది. మైనింగ్, పోలీసులను మచ్చిక చేసుకుని కొందరు రోజుకో ట్రిప్పు వంతున రవాణా చేస్తున్నారు. అధికారులు భాగస్వాములు కావడంతో అక్రమ దందా బయటికి రావడం లేదు.
కలెక్టర్ విధానానికి తూట్లు
ప్రజల అవసరాల దృష్ట్యా అందుబాటులో ధరలో ఇసుక సరఫరా చేసేందుకు కలెక్టర్ కరుణ కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. ఏటూరునాగారం మండలం ఏటూరు వద్ద గోదావరిలో మార్చి 16 ఇసుక క్వారీని ప్రారంభించారు. వ్యాపారుల పెత్తనాన్ని పక్కనబెట్టి ఏటూరు, కంతనపల్లి, సింగారం గ్రామాల్లోని కుటుంబాలతో సహకార సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఇసుక తవ్వకాల బాధ్యతను ఈ సంఘానికి అప్పగించారు. గోదావరిలో తవ్వే ఇసుకకు సంబంధించి ప్రతి క్యూబిక్ మీటరుకు రూ.150 చొప్పున రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఈ సంఘానికి చెల్లిస్తోంది.
రవాణా ఖర్చుల కింద టిప్పర్ల కాంట్రాక్టరుకు క్యూబిక్ మీటరుకు రూ.80 చొప్పున ఖర్చవుతోంది. ఈ ఖర్చు పోను ప్రతి క్యూబిక్ మీటరుకు రూ.70 చొప్పున ఏటూరు సహకార సంఘానికి ఆదాయం ఉంటోం ది. ఈ ప్రక్రియతో సంఘంలోని ప్రతి కుటుంబానికి మొదటి విడతలో రూ.10 వేల చొప్పున ఆదాయం వచ్చింది. మార్కెట్ పెరిగే కొద్ది ఆదాయం పెరగనుంది. ఇలా సహజ వనరుల తవ్వకాల విషయంలో స్థానికులే మొదట లబ్ధి పొందేలా రూపొందించిన ఈ విధానం రాష్ట్రవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తోంది.
అత్యాశతో..
ఏటూరు వద్ద క్వారీలో తవ్విన ఇసుకను టిప్పర్ల సహాయంతో కిలో మీటరున్నర దూరంలో ఉన్న డంపింగ్ యార్డుకు తరలిస్తారు. ఈ డంపింగ్ యార్డును రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ నిర్వహిస్తోంది. ఇందిరా క్రాంతి పథకం(ఐకేపీ) సిబ్బంది విధులు నిర్వహిస్తారు. ఇసుక కోసం వచ్చే లారీలు డంపింగ్ యార్డుకు రెండు కిలో మీటర్ల దూరంలో ఒక పార్కింగ్ స్థలంలో వేచి ఉంటాయి. అక్కడికి లారీ చేరుకోగానే ఇసుకకు సరిపడా డబ్బులు చెక్కు రూపంలో అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. 13.5 క్యూబిక్ మీటర్లు(21 టన్నులు) ఇసుక లారీకి రూ.7,425.. 10.5 క్యూబిక్ మీటర్ల(18 టన్నుల) ఇసుక లారీకి రూ.5,775 ధర ఉంది.
ఈ మొత్తానికి చెక్కు ఇచ్చిన లారీ నిర్వాహకులకు అధికారులు టోకెన్ నెంబరు, వే బిల్లు ఇసా ్తరు. సీరియల్ నంబరు ప్రకారం లారీలో డంపింగ్ యా ర్డుకు వెళ్లి ఇసుకను లోడ్ చేసుకుని వరంగల్, హైదరాబాద్ తదితర ప్రాం తాల వైపు వెళ్తారుు. ఇక్కడే అవినీతి దందా మొదలైంది. ఏటూరు క్వారీ ఇసుకకు ఎక్కువ డిమాండ్ ఉంటోంది. ప్రతిరోజు 250 నుం చి 300 లారీ లు క్వారీకి వస్తున్నాయి. ఒక లారీకి సగటున మూడు, నాలుగు రోజులకు ఒకసారి లోడింగ్ వంతు వస్తోంది. ఇసుక కోసం వచ్చిన లారీలు మూడునాలుగు రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితి. దీంతో నెలలో 8 నుంచి 10 ట్రిప్పులే పడుతున్నాయి. భవన నిర్మాణాల సీజను కావడంతో ఇప్పుడు డిమాండ్ ఉంటోంది.
అక్రమాలు ఇక్కడే..
ఇసుక రవాణా చేసి ఎక్కువ ఆదాయం సమకూర్చుకోవాలని కొందరు అక్రమాలకు తెరలేపారు. స్థానికంగా ఉన్న మైనింగ్, పోలీసు అధికారులకు లారీకి రూ.1000 చొప్పన ఇచ్చి.. ఏటూరుకు తమ లారీ వచ్చిన వెంటనే లోడింగ్ చేసేలా కొత్త వ్యవహారం మొదలుపెట్టారు. మారుమూల ప్రాంతంలో నాలుగు రోజులు వేచి ఉం టే లారీ డ్రైవరు, క్లీనరు భోజన ఖర్చుల కోసమే రూ.2 వేల వరకు అవుతోందని.. రూ.1000 ఇస్తే లారీ త్వరగా వెళ్తొందని అధికారులే సూచనలు ఇస్తున్నారు.
మామూళ్లు ఇచ్చిన లారీలు వచ్చిన వెంటనే అక్కడి అధికారులు.. వీటికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ వెంటనే టోకెన్ నంబర్లు ఇస్తున్నారు. ప్రభుత్వ పనులకు సంబంధించిన లారీలు అని చెప్పి మిగతా వారిని దబాయిస్తున్నారు. అసలే ఇసుక రవాణా వ్యాపారం కావడం.. మైనింగ్ అధికారులు, పోలీసులతో గొడవ ఎందుకనే ఉద్దేశంతో కొందరు లారీ యజమానులు మిన్నకుండిపోతున్నారు. ఇప్పుడిప్పుడే మొదలైన ఈ అడ్డదారి రవాణా కు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
రూ.‘వెయ్యిస్తే’ ఆగకుండా వెళ్లొచ్చు
Published Sun, May 3 2015 2:11 AM | Last Updated on Thu, Jul 11 2019 8:03 PM
Advertisement