మా కంటె మీరే ఎంతో బెటరు...! | setairical story on congress and tdp | Sakshi
Sakshi News home page

మా కంటె మీరే ఎంతో బెటరు...!

Published Sun, Feb 28 2016 3:24 AM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM

మా కంటె మీరే ఎంతో బెటరు...! - Sakshi

మా కంటె మీరే ఎంతో బెటరు...!

ఏపీ, తెలంగాణల్లోని కాంగ్రెస్ నాయకులు వింతైన పరిస్థితిని ఎదుర్కుంటున్నారట.

ఏపీ, తెలంగాణల్లోని కాంగ్రెస్ నాయకులు వింతైన పరిస్థితిని ఎదుర్కుంటున్నారట. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉంటున్నా, ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో ఆ పార్టీకి ఏమాత్రం రాజకీయ ప్రాధాన్యం లేకున్నా  భిన్నమైన ధోరణులను అవలంబించడంపై ఈ పార్టీల్లోనే ఆసక్తికర చర్చ సాగుతోంది. అసెంబ్లీలో ఒక్క సీటు కూడా లేకపోవడంతో  ఏపీలో ఎంతగా పోరాడినా రాజకీయంగా ఫలితాలు రావని తెలిసినా ఆ పార్టీ నేతలు ఏవో కార్యక్రమాలను చేపట్టడాన్ని తెలంగాణ నాయకులు అభినందిస్తున్నారట. అదే తాము తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష ంగా ఉన్నా, అధికార టీఆర్‌ఎస్ తర్వాత తామే రాజకీయంగా ప్రాధాన్యతను పొందుతున్నా ఆ స్థాయిలో ఉద్యమించకపోవడం, చురుకుగా వ్యవహరించకపోవడంపై ఇక్కడి నాయకులు తెగ మథనపడిపోతున్నారట.

ప్రత్యేక తెలంగాణ ఇచ్చినందువల్ల కాంగ్రెస్‌పై ఆ కోపాన్ని ఏపీలో ప్రజలు తమపై చూపారని, ఒక్కసీటు కూడా రాకుండా చేశారని అక్కడి కాంగ్రెస్ నేతలు వాపోతున్నారట. మరి... ప్రత్యేక రాష్ట్రం ఇచ్చాక కూడా తెలంగాణలో కాంగ్రెస్ ఏమాత్రం పుంజుకోకపోవడాన్ని ఏపీ నాయకులు ప్రశ్నిస్తున్నారట. ఏం చేస్తాం మాకంటె మీరే ఎంతో నయం...వెంటనే ఎలాంటి ఫలితం రాదని తెలిసినా ధైర్యంతో పోరాడుతున్నారు అని వారికి తెలంగాణ నాయకులు సర్దిచెబుతున్నారట. అయితే తమ ముఖ్యనేతల తీరుతోనే ఒక  అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కు అన్న చందంగా రాష్ట్రంలో తమ పార్టీ తీరుసాగుతుందని తెలంగాణ నాయకులు అంతర్గత చర్చల్లో గొణుక్కుంటున్నారట.అసలు ఇక్కడి పార్టీలో మార్పు అనేది వస్తుందా... అని ప్రశ్నిస్తున్నారట. ఆయా పదవుల్లో ఉన్న ముఖ్యనాయకులకు వీఆర్‌ఎస్ ఇచ్చి కాయకల్ప చికిత్సచేస్తే తప్ప పార్టీకి పూర్వ వైభవం రాదని పెదవి విరుస్తుండడం కొసమెరుపు....!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement