ఆదిలాబాద్ కల్చరల్ : జిల్లాలో జరిగిన షాదీ ముభారక్ పథకంలో అవినీతికి ఎమ్మార్వో, ఆర్‌ఐ, వీఆర్వో వంటి అధికారులే బాధ్యులని వారిని సైతం చట్టపరంగా శిక్షించాలని ఎంఐఎం జిల్లా ఇన్‌చార్జి మున్సిపల్ చైర్‌పర్సన్ ఫరూక్ అహ్మద్ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం కుటుంబీకులకు అధికారులు, నాయకులు దళారులు రూ. 10 వేల చొప్పున ఇచ్చి అది రుణంగా చెప్పినట్లు బాధితులు ఆరోపిసున్నట్లు పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
‘షాదీ ముబారక్‌లో అధికారులే బాధ్యులు’
Published Tue, May 31 2016 2:09 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
Advertisement
Advertisement