నీటిలో మునిగి మేకల కాపరి మృతి | shepherd drowns in krishna river | Sakshi
Sakshi News home page

నీటిలో మునిగి మేకల కాపరి మృతి

Published Sat, Oct 17 2015 8:22 PM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM

shepherd drowns in krishna river

పెద్ద అడిశర్లపల్లి (నల్లగొండ) : మేకలను తోలుకుని వెళ్తూ ప్రమాదవశాత్తు కృష్ణా నీటిలో మునిగి చనిపోయాడు ఓ మేకల కాపరి. నల్లగొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి మండలంలో శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. మండలంలోని వద్దిపట్ల పంచాయతీ పెద్దగుమ్మడం గ్రామానికి చెందిన శ్రీనయ్య(32) శనివారం సాయంత్రం తన మేకలను మేతకు తోలుకుని కృష్ణా బ్యాక్ వాటర్ ప్రదేశానికి వెళ్లాడు.

అవతలి వైపునకు చేరేందుకు ముందుగా మేకలను తోలాడు. అవి ఒడ్డుకు చేరుకుని మేత మేస్తున్నాయి. అయితే, శ్రీనయ్య కనిపించకపోవటంతో తోటి కాపరులు అంతటా వెదికారు. సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో నీళ్లపైకి తేలిన శ్రీనయ్య మృతదేహం కనిపించటంతో కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement