శిఖర్ ధావన్‌తో శంకర్..
హీరోలపై ఉన్న ఆకర్షణ ఎంతదాకా అయినా తీసుకెళుతుంది. ఒక్కోసారి మనం ఇష్టపడే స్టార్లే మనకు అభిమానులుగా మారిపోతుంటారు. అలాంటి అనుభవం..అదృష్టం నగర యువకుడు శేఖర్‌కు దక్కింది. స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్‌కు వీరాభిమాని అయిన ఇతడు తన టాటూల ద్వారా ధావన్‌నే ఆకర్షించాడు.
హిమాయత్‌నగర్: తమకు నచ్చిన ‘స్టార్లు’ అంటేఎవరికైనా అభిమానం పెల్లుబుకుతుంది. సినీస్టార్, స్పోర్ట్స్‌స్టార్, పొలిటికల్ స్టార్స్ ఎవరైనా సరే.. ఇష్టపడినవారితో ఏదో ఒకరోజు వారితో ఓ ఫొటోదిగాలనుకుంటాం. కనీసం ఆటోగ్రాఫ్ అయినా తీసుకోవాలని ఆశపడతాం. కొందరు మాత్రంఅభిమానమే ఊపిరిగా జీవిస్తారు. నచ్చిన వారి పేర్లను టాటూగా వేయించుకుంటారు. ఇదే కోవలోప్రముఖ ఇండియన్ క్రికెటర్ శిఖర్ ధావన్‌పైవల్లమాలిన అభిమానాన్ని పెంచుకున్నాడు నగరవాసి శంకర్. ఓ చేతిపై శిఖర్ ధావన్ రూపం, మరోచేతిపై ధావన్, అతని భార్య, పిల్లల పేర్లు,ఈ శరీరమంతా నా దేవుడే కనిపించాలంటూ వీపుపై శిఖర్ పేరుతో పాటు అతడు ధరించే జెర్సీ నంబర్‌ను సైతం టాటూగా వేయించుకున్నాడు. ఆహార్యాన్ని సైతం అతడిలాగే మార్చుకున్నాడు శంకర్. ఐపీఎల్ మ్యాచ్‌ల్లో భాగంగా ఈ అభిమానిని ‘సాక్షి’ పలకరిస్తే శిఖర్‌పై తనకున్న వీరాభిమానాన్ని పంచుకున్నాడు.
బేగంపేట్‌కు చెందిన శంకర్ వృత్తిరిత్యా ప్రస్తుతం బెంగుళూరులో ఉంటున్నాడు. జీ క్రికెటర్, కెప్టెన్ సౌరభ్ గంగూలీ స్ఫూర్తితో క్రికెట్ ఆటలోకి ప్రవేశించాడు. అండర్–14 నుంచి నేషనల్స్, ఫెడరేషన్, డివిజన్స్, క్లబ్స్‌కి ఆడుతున్నాడు. ఈ ఆటలో ఇతగాడు ఆల్‌రౌండర్‌గా సైతం ప్రతిభ చాటుతున్నాడు. దేశంలో ఎందరో క్రికెటర్లు ఉండగా.. శేఖర్ మాత్రం ఢిల్లీకి చెందిన ప్రముఖ క్రికెటర్ శిఖర్ ధావన్‌పై అభిమానం పెంచుకుని పెద్ద ఫ్యానైపోయాడు. ఎంతగా తన ఒళ్లంతా శిఖర్ ధావన్‌ను గుర్తుచేసే టాటూలు వేయించుకున్నాడు. అంతేకాదు.. ధావన్ భ్యార్య, కొడుకు పేరు సైతం తన దేహంపై నింపేసుకున్నాడు. శంకర్ కుడిచేతిపై శిఖర్‌ధావన్ ముఖ చిత్రం మాత్రం ప్రేత్యకం. ఈ టాటూ వేసుకోవడమే కాదు.. దానిని తన అభిమాన క్రికెటర్‌కి చూపించాడు కూడా. శంకర్ భుజంపై ఆ చిత్రాన్ని చూసిన శిఖర్ కూడా ఒక్కసారి ఆశ్చర్యపోయాడట.
అభిమానితోనే స్టార్ క్రికెటర్..
ఏ స్టార్ అయినా తనకున్న లక్షలాది మంది అభిమానులతో ఎంతలో ఉడాలో అంతవరకే ఉంటారు. కొందరిని పేరు పెట్టి పిలిచే స్టార్స్ కూడా ఉన్నారు. కానీ.. శంకర్‌కు శిఖర్ ధావన్‌కు మధ్యనున్న అభిమానాన్ని మాటల్లో వర్ణించలేం. తనపై ఇంత అభిమానాన్ని పెంచుకున్న శంకర్‌ను శిఖర్ చాలా బాగా చూసుకుంటాడు. మనదేశంలో ఎక్కడైనా మ్యాచ్‌లు జరిగితే ఆ మ్యాచెస్‌కి శంకర్‌ని కూడా ఫ్లైట్‌లో ధావన్ తీసికెళ్లడం ఓ గొప్ప విషయం. అందులోనూ పక్క సీటులో కూర్చుబెట్టుకోవడం చూసిన ప్రతి ఒక్కరూ వీరిద్దరి అభిమానం పట్ల కథలు కథలుగా చెప్పుకుంటున్నారు.
ఒంటిపై ఇష్టమైన నంబర్–25
శిఖర్ ధావన్‌కు ఇష్టమైన జెర్సీ నబంర్–25. శిఖర్ ఆడే వన్‌డే, టెస్ట్, 20–20 మ్యాచ్‌ల్లో తన జెర్సీపై కూడా ఇదే నంబర్ ఉంటుంది. దీనికి గుర్తుగా శంకర్ తన వీపుపై ‘శిఖర్ ధావన్–25’ అనే టాటూను వేసుకున్నాడు. అంతేకాదు డిసెంబర్–5న ధావన్ పుట్టినరోజు. ఆ రోజును పురస్కరించుకుని మ్యాచ్‌ల్లో బిజీగా ఉన్న ధావన్ వద్దకు వెళ్లిన శంకర్ ధావన్ డ్రస్సింగ్ రూమ్‌లో కేక్‌ను కట్ చేశాడు. ఓ సాధారణ అభిమాని అంతర్జాతీయ క్రికెటర్ డ్రస్సింగ్ రూమ్‌లోకి వెళ్లడం ఓ గొప్ప విషయంగా పరిగణిస్తున్నారు తోటి క్రీడాకారులు. ఇక శంకర్ పుట్టినరోజుకు శిఖర్‌ధావన్ వాట్సప్, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్ర్రాగామ్‌లో పంపిన శుభాకాంక్షల మెసేజ్‌లు, వీడియోలు కోకొల్లలు.
ఎఫ్‌బీలోధావన్ పోస్ట్
శంకర్ తనపై ఇష్టంతో వీపుపై వేయించుకున్న టాటూపై ధావన్ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ తన ఎఫ్‌బీ ప్రొఫైల్‌లో పోస్ట్ కూడా పెట్టాడు. ‘చాలా లక్కీ.. శంకర్ లాంటి ఫ్యాన్స్ నన్ను సపోర్ట్ చేయడం. శంకర్ టాటూ కూడా వేయించుకున్నాడు. శంకర్ నా దిల్‌ని కుష్ చేశాడు’ అంటూ పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో పెద్ద వైరల్ అయ్యింది కూడా.
Comments
Please login to add a commentAdd a comment