సాక్షి, హైదరాబాద్ : సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికల్లో నైతిక విజయం తమదేనని కాంగ్రెస్ సీనియర్ నేత గండ్ర వెంకట రమణారెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ... బలుపును చూసి వాపు అనుకోవడం పొరపాటు అని అన్నారు. గనుల్లో టీబీజీకేఎస్ విచ్చలవిడిగా డబ్బులు పంచిందని గండ్ర ఆరోపించారు. కొన్నిచోట్ల బెదిరింపులకు పాల్పడిందని, అధికార దుర్వినియోగంపై పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని ఆయన అన్నారు. కాగా సింగరేణి ఎన్నికల్లో మొత్తం 17 కార్మిక సంఘాలు పోటీ పడగా, టీఆర్‌ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్), సీపీఐ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ల మధ్యే ప్రధాన పోటీ ఏర్పడింది. 11 డివిజన్లకుగానూ 9 డివిజన్లను టీబీజీకేఎస్ కైవసం చేసుకుంది. ఏఐటీయూసీ రెండు డివిజన్లతో సరిపెట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment