
'జూన్ లో తెలంగాణ పర్యటనకు సోనియా'
హైదరాబాద్: ఏఐసీసీ అధ్యక్షరాలు సోనియాగాంధీ జూన్ నెలాఖరులోగా తెలంగాణ రాష్ట్ర పర్యటనకు రానన్నట్లు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే సోనియా పర్యటన ఇంకా ఖరారు కాలేదన్నారు.
జూన్ 2 న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోనియాకు కృతజ్ఞత దినంగా జరుపుకుంటామన్నారు.జూన్ 3 వ తేదీన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏడాది పాలనపై సదస్సు నిర్వహిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.