'కాంగ్రెస్ పార్టీ ఓటమికి నేతలదే సమిష్టి బాధ్యత'
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధినేత్ర సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ గెలవలేకపోయిందని తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి నేతలందరూ సమిష్టి బాధ్యత వహించాలని ఆయన అభిప్రాయపడ్డారు.
కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే అంశంలో కార్యకర్తలు, నేతల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. జూలై 21 నుంచి 31 వరకు నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తామని ఉత్తమకుమార్ రెడ్డి తెలిపారు.