సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా గాంధీభవన్‌లో కేక్‌ను కట్ చేసి జైపాల్‌రెడ్డికి తినిపిస్తున్న ఉత్తమ్
• పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్
• ఘనంగా సోనియా జన్మదినం
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ అధినేత్రి సోని యా గాంధీ వల్లే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వాస్తవ రూపం దాల్చిందని పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. సోనియా గాంధీ 70వ జన్మదినం సందర్భంగా గాంధీభ వన్‌లో శుక్రవారం పలు కార్యక్రమాలను నిర్వి హంచారు. కేక్ కట్ చేసిన అనంతరం రక్తదా న, ఆరోగ్య శిబిరాలను నిర్వహించారు. తెలం గాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామంటూ 2009 లో ఇదేరోజున ప్రకటన చేసినందుకు రాష్ట్ర వ్యాప్తంగా కృతజ్ఞత దినోత్సవాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిర్వహించారుు. గాంధీభవ న్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్ర మార్క, కేంద్ర మాజీ మంత్రులు ఎస్.జైపాల్ రెడ్డి, సర్వే సత్యనారాయణ, బలరాం నాయక్, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, నేతలు వి.హనుమంతరావు, దానం నాగేం దర్, మర్రి శశిధర్‌రెడ్డి, అంజన్‌కుమార్‌యాద వ్, వినోద్‌కుమార్, అనిల్‌కుమార్‌యాదవ్ పాల్గొన్నారు.
ప్రకాశం హాలులో జరిగిన సమా వేశంలో ఉత్తమ్ మాట్లాడుతూ, రాజకీయ ప్రయోజనాలు, ఇబ్బందులు, నష్టాన్ని ఆలో చించకుండా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట కోసం సోనియా రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం సోనియా పేరు ఉంటుం దన్నారు. దేశంలో పేద రిక నిర్మూలన, పారదర్శక పాలన కోసం యూపీఏ ప్రభుత్వం తీసుకున్న చర్యలన్నీ ఫలిస్తున్నాయని పేర్కొ న్నారు. ఆహార భద్రత చట్టం, ఉపాధి హామీ చట్టం, సమాచార హక్కు చట్టం వంటి విప్లవాత్మక నిర్ణయాలను సోనియా నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ తీసు కుందని ఉత్తమ్ చెప్పారు. తెలంగాణ వస్తే ఎన్నో లాభాలుంటాయని ఆశించిన ప్రజలకు అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ తీవ్ర నిరా శను కలిగిస్తున్నదని విమర్శించారు.
టీఆర్‌ఎస్ పాలకులకు బాధ్యత లేదు: భట్టి
ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వట్టిమా టలతో దాటవేస్తూ, ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని ఉత్తమ్ విమర్శించారు. విశ్వనగరం చేస్తామంటూ ఉన్న హైదరా బాద్‌ను లేకుండా చేస్తున్నారని ధ్వజమె త్తారు. ఇప్పటికే అనేక కుంభకోణాలు, అవినీతి బయట పడ్డాయని ఆరోపించారు. మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ పాలకులకు బాధ్యత, ప్రజల గురించి ఆలోచించే సమయం లేవన్నారు. శాసనసభను సజా వుగా నడి పిం చాల్సిన మంత్రి హరీశ్‌రావు బాధ్య త లేకుండా, రెచ్చ గొట్టేలా మాట్లా డుతున్నారని విమ ర్శించారు. దళితుల కు భూములు ఇవ్వ కుండా, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్ట కుండా, ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించ కుండా కాంగ్రెస్ పార్టీని కడిగిపారే స్తామనడం మంత్రి హరీశ్‌రావుబాధ్యతా రాహిత్యమన్నారు. ప్రజా సమస్యలపై చర్చిస్తే తమను కాంగ్రెస్ కడిగి పారేస్తుం దనే భయంతోనే హరీశ్ నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నారని భట్టి విక్రమార్క దుయ్యబట్టారు.
తెలంగాణ దేవత సోనియా: జానా
తెలంగాణ రాష్ట్రానికి సోనియా గాంధీ దేవత అని ప్రతిపక్ష నాయకుడు కె.జానా రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల 60 ఏళ్ల స్వప్నాన్ని సోనియా సాకారం చేశారని, ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు.