ఏప్రిల్‌ నాటికి దక్షిణ మధ్య రైల్వే రెండు ముక్కలు  | South Central Railway Bifurcation DPR Sent To Central Government | Sakshi
Sakshi News home page

ఏప్రిల్‌ నాటికి దక్షిణ మధ్య రైల్వే రెండు ముక్కలు 

Published Wed, Oct 2 2019 4:19 AM | Last Updated on Wed, Oct 2 2019 4:20 AM

South Central Railway Bifurcation DPR Sent To Central Government - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దక్షిణ మధ్య రైల్వే రెండుగా చీలనుంది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్నట్టుగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక రైల్వే జోన్‌ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటుకు ఇప్పటికే కేంద్రప్రభుత్వం సమ్మతించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి దక్షిణ మధ్య రైల్వే అధికారులు తాజాగా డీపీఆర్‌ సిద్ధం చేసి కేంద్రప్రభుత్వానికి పంపించారు. వచ్చే ఏప్రిల్‌ నాటికి కొత్త జోన్‌ ఏర్పాటు చేసే దిశగా ఢిల్లీలో కసరత్తు జరుగుతోంది. 

ఈ దక్షిణ కోస్తా రైల్వే పరిధిలోకి విజయవాడ, గుంటూరు, గుంతకల్‌ డివిజన్లుండగా, తెలంగాణ పరిధి నుంచి సికింద్రాబాద్, హైదరాబాద్‌ డివిజన్లు, మహారాష్ట్ర నుంచి నాందేడ్‌ డివిజన్‌ ఉన్నాయి. ఇంతకాలం విశాఖ పట్నం, విజయనగరం, శ్రీకాకుళం వాల్తేరు డివిజన్‌గా ఈస్ట్‌కోస్ట్‌ జోన్‌ (భువనేశ్వర్‌)లో భాగంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ వాల్తేరు డివిజన్‌ కొత్తగా ఏర్పడే దక్షిణ కోస్తా జోన్‌లో ఉం డనుంది. వచ్చే ఏప్రిల్‌ నాటికి కొత్త జోన్‌ ఏర్పాటై విశాఖలో ప్రధాన కార్యాలయం పని ప్రారంభించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.  

సిబ్బందిలో భావోద్వేగాలు.. 
ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే రెండుగా విడిపో నుండటంతో జోన్‌ పరిధిలోని సిబ్బందిలో భావోద్వేగాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఐదు దశా  బ్దాల క్రితం ఏర్పడ్డ జోన్‌ ఇప్పుడు రెండుగా చీలనుండటంతో ప్రాంతాల వారీగా సిబ్బంది విధుల్లో చేరాల్సి ఉంటుంది. ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారు కొత్త జోన్‌ పరిధిలోకి వెళ్లాల్సి ఉం టుంది. సికింద్రాబాద్, హైదరాబాద్‌ డివిజన్ల ప రిధిలో ప్రస్తుతం విధుల్లో ఉన్న ఆంధ్రా ప్రాంతం వారు కొత్త జోన్‌ ఉద్యోగులుగా మారతారు. 

ఇటు విజయవాడ, గుంటూరు, గుంతకల్‌ పరిధిలో ఉన్న తెలంగాణ ప్రాంతం వారు సికింద్రాబాద్‌ కేంద్రంగా ఉండే దక్షిణ మధ్య రైల్వే పరిధిలోకి వస్తారు. దీంతో ఈసారి దక్షిణ మధ్య రైల్వే వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవా లని నిర్ణయించారు. గాంధీ జయంతి రోజునే దక్షిణ మధ్య రైల్వే కూడా ఆవిర్భవించినందున బుధవారం దక్షిణ మధ్య రైల్వే వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

ఇదీ నేపథ్యం 
ఆవిర్భావం: 1966 అక్టోబరు 2, దేశంలో నాటి కి తొమ్మిదో జోన్‌. నాటి రైల్వే మంత్రి ఎస్‌కే పాటిల్‌ ఈ జోన్‌ను ప్రారంభించారు.  
అంతకు పూర్వం: నిజామ్స్‌ గ్యారింటీడ్‌ స్టేట్‌ రైల్వేగా ఇది ఆవిర్భవించింది. 1874 అక్టోబరు 8న వాడీ దగ్గరలోని చిత్తాపూర్‌ నుంచి సికింద్రాబాద్‌ మధ్య గ్రేట్‌ ఇండియన్‌ పెనిన్సులా రైల్వేస్‌ (జీఐపీ), నిజాం స్టేట్‌ సంయుక్తాధ్వర్యంలో 110 కి.మీ. రైలు మార్గంతో ఇది రూపొందింది.  

పరిధి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలు, 754 స్టేషన్లు, 6,234 కి.మీ. రైల్వే లైన్‌. దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు తర్వాత 1,083 కి.మీ. కొత్త లైన్‌ ఏర్పాటు. ప్రస్తుతం తిరుగుతున్న రైళ్లు 750. 16 ఏళ్ల క్రితం ఎంఎంటీఎస్‌ సరీ్వసు ప్రారంభం.  
సరుకు రవాణా: జోన్‌ ఏర్పడ్డ తొలి సంవత్స రం 11 మిలియన్‌ టన్నులు. 2011–12లో వంద మిలియన్‌ టన్నుల మైలురాయి, 2018–19లో 122.5 మిలియన్‌ టన్నుల స్థాయికి చేరిక. 
ప్రయాణికులు: తొలి సంవత్సరం 11.50 కోట్ల మంది, 2018–19లో 38.30 కోట్ల మంది.  
ఆదాయం: రూ.68.06 కోట్ల తొలి ఏడాది ఆదాయం నుంచి రూ.15,640 కోట్లకు చేరిక

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement