
ధర్నా చేస్తున్న టీవీఎస్ నాయకులు
భీమిని : విద్యార్థుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు నడపాలని డిమాండ్ చేస్తూ టీవీఎస్ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేపట్టారు. సంఘం జిల్లా అధ్యక్షుడు జిల్లెల్ల మహేశ్ మాట్లాడుతూ బెల్లంపల్లి నుంచి కొంచెల్లి, దహెగాంకు నడిచే బస్సులను కన్నెపల్లి మండల కేంద్రానికి వచ్చేలా చూడాలని కోరారు. అష్టకష్టాలు ప డుతూ కళాశాలలకు వెళ్తున్న విద్యార్థుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సు నడిపించాలని డిమాండ్ చేశారు. ధర్నాలో చండె సతీశ్, ప్రకాశ్, శ్రీనివాస్, సాయికిరణ్, లోకేశ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment